ఆవ నూనెతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!

ఆవ నూనెతో ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవచ్చు. ఇంట్లో మూడు పూటలా తయారు చేసుకునె ఆహారంలో ఈ నూనెని వాడటం వలన వేరే నూనెతో వాడే వారికంటే ఆరోగ్యవంతులుగా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. చాలారకాల వ్యాధుల నుంచి మనల్ని మనం సురక్షితంగా కాపాడుకోవచ్చని డైటీషియన్లు, ఆరోగ్య నిపుణులే చెబుతున్నారు. అయితే అవ నూనె వలన కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దమా.

Mustard Oil
Mustard Oil

ఆవ నూనెతో తయారైన ఆహారం తింటే మన గొంతు, శ్వాసకోశ వ్యవస్థ బలంగా ఉంటుంది. తరుచూ ఆవనూనెను తీసుకోవడం వల్ల జ్వరం, జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇందులో ఉండే మంచి కొవ్వు నిల్వలతో గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు తెలిపారు. అంతేకాదు థైరాయిడ్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అంతేగాక జీర్ణక్రియను మెరుగుపరచడంలోనూ ఆవ నూనె ఎంతగానో తోడ్పడుతుందన్నారు.

బయటకు వెళ్లే సమయంలో.. అరచేతిపై కొద్దిగా ఆవ నూనెను రుద్ది.. దానిని ముఖానికి పూయండి. ఇది సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన అతినీలలోహిత కిరణాల నుండి మీ చర్మాన్ని కాపాడుతుంది. ఆవ నూనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి అలెర్జీలు, దద్దుర్లను నివారిస్తాయి. ఆవ నూనెను వాడితే చర్మం పొడిబారడం.. దురదను నివారించడంలోనూ మంచి ఫలితాలు కనిపిస్తాయి.

ఆవ నూనె ద్వారా చర్మంపై ముదురు మచ్చలు, ట్యాన్ నివారించడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఇక పెరుగు, నిమ్మరసం, ఆవ నూనె కలపి ప్యాక్ లా వేసుకుని ముఖం మీద పూయండి.10-15 నిమిషాల తరువాత చల్లటి నీటితో కడగాలి. దాంతో ముఖం మెరుపును సంతరించుకుంటుంది. ఆవ నూనె, కొబ్బరి నూనె కలపి చర్మంపై 10 నిమిషాల పాటు మసాజ్ చేస్తే చర్మం మృదువుగా.. ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఆవ నూనెలో విటమిన్ ఎ, ఇ.. బి కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా ఇది ముఖం మీద ఉన్న ముడతలు తగ్గించడానికి సహాయపడుతుంది.