జీర్ణ వ్యవస్థలో ఉండే చివరి భాగాన్ని కోలన్ అని అంటారు. ఈ భాగం క్యాన్సర్ బారిన పడితే కోలన్ క్యాన్సర్ అని పిలుస్తారు. పెద్ద పేగు చివరి భాగంలో కణుతులు ఏర్పడటం వల్ల కోలన్ క్యాన్సర్ వస్తుంది. వీటి లక్షణాలను గుర్తించితే ఆ కణుతులను తీసివేయవచ్చు. కానీ కోలన్ క్యాన్సర్ యొక్క లక్షణాలు నిర్దిష్టంగా ఉండవు. ఈ కాన్సర్ మొదటి దశ లో లక్షణాలు కూడా ఉండకపోవచ్చు మరియు కొన్ని రోజుల తర్వాత లక్షణాలు మారుతూ ఉంటాయి.
కోలన్ మరియు కోలోరెక్టల్ క్యాన్సర్ యొక్క లక్షణాలు :
మలబద్ధకం, అజీర్తి లేక విరేచనాలు కావడం, మల రక్తస్రావం, పొట్ట కింది భాగంలో నొప్పి, అకారణమైన నీరసం, బరువు తగ్గడం, కడుపులో గ్యాస్ ఉండటం, మలవిసర్జనకు వెళ్లేటప్పుడు నొప్పి కలగడం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ లక్షణాలను తీవ్రంగా పరిగణించక పోతే లివర్ కు ఎంతో ప్రమాదం ఉంటుంది. అకస్మాత్తుగా జీర్ణ వ్యవస్థ లో మార్పులు కనిపించినా, రోజు రోజుకి ఎక్కువ అవుతున్నట్లు అయితే తప్పకుండా డాక్టర్ వద్దకు వెళ్లాలి.
కోలన్ క్యాన్సర్కు చికిత్స క్యాన్సర్ దశను బట్టి ఉంటుంది. మొదటి దశలోనే గుర్తిస్తే రాడికల్ సర్జరీ చేయవచ్చు. ప్రస్తుతం దీనిని లాప్రోస్కోపిక్ పద్ధతిలో చేస్తున్నారు, ఇలా చేస్తే రోగి త్వరగా కోలుకుంటాడు. అదే క్యాన్సర్ రెండవ దశలో ఉంటే కీమోథెరపీ, రేడియోథెరపీ వంటివి చేస్తారు, ఆ తర్వాత సర్జరీ చేస్తారు. అదే చివరి దశలో అయితే మోనోక్లోనల్ వంటి మందులు ఇచ్చి రోగి యొక్క కాలాన్ని పెంచుతారు. కడుపు లోని అసౌకర్యంగా ఉండటం, ఆకలి లేకపోవడం, వాంతులు మరియు శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు ఉన్నట్టయితే క్యాన్సర్ మరింత అభివృద్ధి చెందుతుంది అని అర్థం. కొవ్వు ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల కోలన్ క్యాన్సర్ మరింత తీవ్రంగా మారుతుంది.