ఉప్పులో నమ్మలేని నిజాలు!

-

ఉప్పు లేనిదే ఏ కూరా రుచించదు. సాధారణంగా మనం ఉప్పు అంటే రోజువారీ కూరల్లో వేసుకునే ఓ పదార్థంగా భావిస్తాం. ఈ ఖనిజాన్ని పరిశోధించిన శాస్త్రవేత్తలకు చిత్రమైన విషయాలు తెలిశాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.

salt

మనం చిన్నప్పుడు బుక్స్‌లో చదివాం. కుక్క కరవగానే వెంటనే సబ్బుతో గాయాన్ని కడగాలి అని. కానీ సోప్‌ కంటే ఉప్పు నీటితో గాయాల్ని కడిగితే, ఇన్ఫెక్షన్లు రావని పరిశోధనల్లో తేలింది.
ముఖ్యంగా ఉప్పు ఎక్కువగా తింటే, మెదడులో మంట, నొప్పి, దురదల వంటివి వచ్చేలా చేస్తుంది. ఎలుకలపై ప్రయోగాలు చెయ్యగా, సాల్ట్‌ ఎక్కువైన ఎలుకలు… పిచ్చిపిచ్చిగా ప్రవర్తించాయి. సరిపడా ఉప్పు తిన్న ఎలుకలు మాత్రం మామూలుగా ఉన్నాయని తేల్చారు.
సాధారణంగా నక్షత్రాలు చనిపోయేటప్పుడు హైడ్రోజన్, హీలియం మండుతాయి. ఆ తర్వాత గ్యాస్, దుమ్మును ఎగజిమ్ముతాయి. చివరకు మరుగుజ్జు నక్షత్రాలుగా మారతాయి. ఐతే, సోడియం (సాల్ట్‌) ఎక్కువగా ఉండే నక్షత్రాలు గ్యాస్, దుమ్మును ఎగజిమ్మవు. వెంటనే మరుగుజ్జు నక్షత్రాలుగా మారతాయి.
భూ వాతావరణంలో ఉప్పుని చల్లితే చాలు, అది వాతావరణాన్ని చల్లగా చేస్తుంది. భూతాపాన్ని తగ్గిస్తుంది.కానీ, ఇది భూమిపై ఉన్న ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్‌లను నాశనం చెయ్యగలదు. అందువల్ల భూమిపై వేడిని తగ్గించేందుకు ఉప్పును చల్లడం సరైన పద్ధతి కాదని పరిశోధకులు తెలిపారు.

షుగర్‌ ఎక్కువ తీసుకుంటే కలిగే నష్టాలేంటో ప్రపంచంలో చాలా మందికి తెలుసు. అందుకే దీని వినియోగం తగ్గించారు. ఉప్పు ఎక్కువ తీసుకుంటే ప్రమాదం అన్న విషయం చాలా మందికి తెలియదు. అందుకే ఉప్పును ఎక్కువగా తీసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version