వంకాయ తింటే నిజంగానే… దురదలు, ఎలర్జీలు వస్తాయి అనుకుంటున్నారా..?

-

చాలమంది వంకాయ తింటే.. దురదలు వస్తాయి, నొప్పులు ఎక్కువవుతాయి, వాతం చేస్తుంది, వాపులు వస్తాయి అనుకుంటారు. ఇవన్నీ అపోహ మాత్రమే.. అసలు వంకాయకు ఇలాంటి గుణాలు ఏమీ లేవు. కానీ చాలామందికి.. వంకాయ తిన్న మరుసటి రోజు దురదలు, దద్దుర్లు లాంటివి వస్తాయి కదా అనుకుంటున్నారా..? ఈరోజు మనం ఇలాంటి అపోహలన్నీ పటాపంచలు చేద్దాం.!

అవును వంకాయ తిన్న మరుసటి రోజు కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి.. కానీ దానికి కారణం.. వంకాయ కాదు.. వంకాయను వండుకునే పద్దతి. ఎవరైన గుత్తివంకాయను మసాలాలు వేసి పులుసులు పెడతారు. తక్కువ మంది ఫ్రై చేసుకుంటారు. ఇక పులుసు కూరల్లో.. చింతపండు గుజ్జు వేస్తారు. ఏ వంటల్లో అయితే.. చింతపండు గుజ్జు పుడతుందో.. అందులో ఉప్పు, కారం, మసాలాలు, నూనె అన్నీ డబుల్ పడతాయి. వీటి కారణంగా.. వంకాయను ఇలా చేసుకుని తిన్నాక.. వాతం చేస్తుంది, ఎలర్జీ వస్తుంది.

వంకాయను ఎలా వండుకుని తినటం మంచిది..?

గుత్తివంకాయ కూరల్లో చింతపండు గుజ్జు తక్కువ వేసి ఉప్పు, కారం తక్కువ వేసుకుని వండుకోవచ్చు.అసలు ఇలా కాకుండా.. పాలు పోసి వండుకుని తినటం మరీ మంచిది. సింపుల్ లాజిక్.. పాలు పోసి వండిన కర్రీ నాలుగు ఐదు గంటల్లో చెడిపోతుంది. కానీ చింతపండు గుజ్జు వేసిన కర్రీ మరుసటి రోజు వరకు అయినా అలానే ఉంటుంది..ఎందుకు అందులో ఉప్పు ఎక్కువ ఉంది కాబట్టి చెడిపోకుండా చూస్తుంది. అసలు కారణం ఉప్పు అయితే.. అందరూ వంకాయ తినటం వల్ల ఈ ఇబ్బందులు వస్తాయి అనే భ్రమలో ఉండిపోయారు.

వంకాయే కాదు.. ఇంకా చాలా కూరగాయల మీద జనాలకు కొన్ని అపనమ్మకాలు ఉన్నాయి. వాటిల్లో. బంగాళదుంప కూడా ఒకటి. బంగాళ దుంప తింటే కాళ్లు వాస్తాయి అంటారు. గుమ్మడికాయ, చేమదుంపలకు అంతే.. ఈ పులుసు అన్నింటికీ పైన చెప్పిన కారణమే. చింతపండు గుజ్జు వేసి.. ఉప్పు వేసుకోవడమే. మనం మొదటి నుంచి ఈ కూరలన్నీ పులుసులతో చేసుకోవడమే ఈ అపోహలకు దారితీసింది.

ఎలర్జీలు వచ్చిన వారు ఈ వంకాయ, బంగాళదుంప, కందలను తినటం మానేస్తారు. వండేతీరు మార్చాలి కానీ, తినటం ఆపేయకూడదు అంటున్నారు ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు. వండే పద్దతి వల్ల ఎలర్జీ తప్ప, కూరగాయలు ఎలర్జీ కాదని గమనించండి.

మరి పత్తైం చేసే వాళ్లకు ఎందుకు ఇలాంటి కూరగాయలను తినొద్దంటారు..?

జనరల్గా డాక్టర్లు తమంతట తాము ఇవి తినొద్దు అని చెప్పరు. మనమే ముందు జాగ్రత్తగా అడుగుతాం.. ఏమైనా పత్తెం చేయాలా అని.. అప్పుడు ఇక డాక్టర్లు.. మీకు ఏది పడకపోతే అది తినటం మానేయండి అంటారు. మనకు ముందు నుంచే.. ఈ కూరగాయల మీద అపోహ ఉంది కాబట్టి వీటిని ఇక పక్కన పెట్టేస్తాం తప్ప.. ఎటువంటి పరిస్థితుల్లో అయనా.. పైన చెప్పిన కూరగాయలు తినదగినవే.. వండే విధానం కరెక్టుగా ఉంటే చాలు.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఎక్కడా కూడా సైంటిఫిక్ గా ఈ కూరగాయల వల్ల ఎలర్జీలు, దద్దుర్లు, వాతాలు వస్తాయి అని నిరూపించలేదట.

ఉప్పు, నూనె తక్కువ వేసుకుని ఏ కూరగాయలు అయినా వండుకుంటే.. అసలు ఎలాంటి సమస్యలు రావంటున్నారు.. ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు. కాబట్టి అపోహలు మాని వండే విధానం మార్చుకోండి..!

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version