సృష్టిలో మనకు లభించే చాలా ఆకుల గురించి మనం లైట్ తీసుకుంటాం. వైద్యులు చెప్పినా ఎవరు చెప్పినా సరే మనకు నచ్చకపోతే అది ఏ విధంగా ఉన్నా సరే మనం పట్టించుకునే పరిస్థితి ఉండదు. చాలా ఆకులు సృష్టిలో మనకు ఎన్నో విధాలుగా ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుతూ వస్తున్నాయి. అలాంటి వాటిల్లో మనం అరుదుగా వాడే పుదీనా కూడా ఉంటుంది.
ఆరోమాథెరపీతో ద్వారా సుగంధాలను పీల్చడం అంటే, శరీరంలో ఉన్న దుర్గందాలను బయటకు పంపడమే. మనం పీల్చిన సుగంధాలు శ్వాసకోశాల్లో నిండిపోయి అక్కడి నుంచి రక్తంతో కలవడం ద్వారా శరీరంలోని అణువణువూ వ్యాపించే అవకాశం ఉంటుంది. అలాంటి మొక్కలలో పుదీనా కూడా ఒకటి ఉంటుంది. దాని వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు వైద్యులు. పుదీనా ఆకుల వాసన మెదడును ఉత్తేజితం చేస్తుందని చెప్తూ,
ఒత్తిళ్లతో అలసిపోయిన మెదడుకు శక్తిదాయకంగా పనిచేస్తుందని, ఏకాగ్రతను పెంచడం ద్వారా స్పష్టమైన ఆలోచనలకు మూలమవుతుందని అంటున్నారు. ఉత్సాహాన్ని నింపడంతో పాటు మనలో ఉన్న నీరసాన్ని కూడా దూరం చేస్తుందని సూచిస్తున్నారు. పుదీనా వాసన పీల్చడం ద్వారా తలనొప్పులు తగ్గుతాయని, పూడుకుపోయిన సైనస్ గదులు శుభ్రమవుతాయని అంటున్నారు. మైగ్రేన్ సమస్య కూడా తగ్గిపోతుంది. మంచి నిద్ర పడుతుందని అంటున్నారు.