పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. వేసవిలో పెరుగు తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పనితీరు మెరుగుపడుతుంది. ఇందులో కాల్షియం, ప్రోటీన్, రైబోఫ్లేవిన్, విటమిన్ బి6, బి12ఉంటాయి. వీటివల్ల శరీరం బలంగా మారుతుంది. శరీరంలోని విష పదార్థాలను బయటకి నెట్టివేసే గుణం పెరుగులో ఉంది. అందువల్ల అలసట, బలహీనత తగ్గిపోతుంది. నిర్జలీకరణం నుండి రక్షిస్తుంది. ఐతే పెరుగుని ఎలా తినాలి అనే దానికి ఒక పద్దతుంది. పెరుగుతో పాటు తీసుకోకూడని కొన్ని ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అరటి పండు, పెరుగు
అరటి పండుతో పాటు పెరుగుని తినకూడదు. దీనివల్ల శరీరానికి చాలా హాని కలుగుతుంది. అలా కాకుండా పాలు, అరటి పండు కలిపి తినవచ్చు.
పెరుగు ఉల్లిపాయ
వేసవిలో ఈ రెండింటినీ తినడానికి జనాలు ఎక్కువగా ఇష్టపడతారు. కానీ రెండింటినీ కలిపి తినడం వల్ల అనారోగ్యం తలెత్తుతుంది. అసిడిటీ, గ్యాస్, అలెర్జీ, వాంతులు రావడానికి అవకాశం ఉంది. అందుకే ఈ రెండింటినీ కలిపి తీసుకోకూడదు.
మినప పప్పు, పెరుగు
మినప పప్పు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ పెరుగుతో పాటు మినప పప్పుని తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. దీనివల్ల కడుపు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ.
పెరుగు, చేప
చేపలతో పాటు పెరుగుని తీసుకోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి. వాంతులు, అజీర్తి సమస్యలు ఉద్భవించే అవకాశం ఎక్కువ. చేపలని ఎప్పుడు తిన్నా దానితో పాటు పెరుగు తినకుండా ఉండండి.
పాలు, పెరుగు
పాలతో తయారయ్యే పెరుగుని పాలతో కలుపుకుని తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. డయేరియా, అసిడిటీ, గ్యాస్ సమస్యలు రావడానికి ఇది కారణమవుతుంది.