నిలబడి నీరు తాగుతున్నారా… అయితే ఇది చదవండి. ?

-

పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీరు తాగడం మంచిది అంటారు పెద్దలు. అలానే కదా చేస్తున్నాం మరి తప్పేముంది. అది సామెత. పాలు, నీరు మధ్య డిఫ్రెన్స్‌ చెప్పడానికి దీన్ని ఉపయోగిస్తారు. అంతేకాని అలానే చేయమని కాదు. నిలబడి నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థకి ఇబ్బంది కలుగుతుంది. దీంతో ఆరోగ్యం పాడవ్వడం ఖాయమంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకు తాగకూడదో తెలుసుకుందాం.

నీటిని మించిన ఔషధం మరొకటి లేదు. నీరు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది. అలా అని ఎలా బడితే అలా తాగకూడదు. నీరు లేకుండా బతకలేమన్నది వాస్తవ. మనిషి హైడ్రేటెడ్‌గా ఉండాలన్నా.. అదనపు క్యాలరీలు బర్న్‌ చేయడానికైనా నీరు తాగాలి. అయితే నిలబడి నీరు తాగడం వల్ల ఏం జరుగుతుందో అందరికీ తెలియదు. తెలిసే..్త ఒకరు కూడా అలా చేయరు. సామెత చెప్పినవారే నిలబడి నీరు తాగకూడదని కూడా చెబుతారు. ప్రదేశం ఏదైనా, ఎప్పుడైనా నీరు తాగాల్సి వస్తే మాత్రం కూర్చోనే తాగాలి. లేదంటే ఒక్కసారిగా ఆహార గొట్టం ద్వారా జీర్ణాశయంలోకి వెళ్తుంది. దీంతో అజీర్తి, అసిడిటీలాంటి ఇతర సమస్యలు వస్తాయి.

సమస్యలు..

నీరు తాగడం వల్ల చర్మం డీహైడ్రేషన్‌ బారిన పడకుండా ఉంటుంది. దీంతో చర్మం ఎప్పుడూ తేమగా ఉంటుంది. ఇలా ఉండడం వల్ల చర్మం కాంతివంతంగా కనబడడానికి దోహదపడుతుంది. రాబోతున్నది ఎండాకాలం. అసలే ఎండలు. జనవరి నెల నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. ఇక మార్చి, ఏప్రిల్‌కు వచ్చేసరికి పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో ఊహించుకుంటేనే భయంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో దాహమేసినప్పుడు ఎలా అయితేనేం నీరు తాగాలనుకుంటాం. ఎంత దాహమైనా సరే కొంచెం ఓపిక పట్టి కూర్చోని తాగండి. అలా అయితేనే కడుపు నిండుతుంది. దీనివల్ల జీర్ణక్రియ ప్రక్రియకు ఎలాంటి భంగం కలుగదు. నిలబడి తాగడం వల్ల కిడ్నీలకు నీరు అందదు. దీనివల్ల మూత్రాశయ సమస్యలు, కిడ్నీల్లో రాళ్లు, ఇన్ఫెక్షన్‌ సమస్యలకు దారితీస్తాయి. నీలబడి నీరు తాగడం వల్ల నీళ్లు మూత్రపిండాల ద్వారా సరిగా వడకట్టడానికి వీలుపడదు. తద్వారా వ్యర్థపదార్థాలు నేరుగా మూత్రపిండాల్లోకి వెళ్లి రక్తంతో కలిసి, మూత్రపిండాల నష్టాన్ని కలిగిస్తుంది. ఇలా చేయడం వల్ల నాడీవ్యవస్థ దెబ్బతింటుంది. ద్రవాల సమతుల్యత దెబ్బతిని కీళ్లల్లో ఎక్కువ ద్రవాలు చేరి ఆర్థరైటీస్‌ కీళ్లవాతం వంటి సమస్యలకు దారితీస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news