చాలా పెద్ద తప్పు చేశారు .. ఇదెక్కడి అన్యాయం ?

-

ఇటీవల వైఎస్ జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమానంగా డెవలప్ కావాలని వికేంద్రీకరణ పేరిట మూడు రాజధాని అంశాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది. దీంతో ఆంధ్ర రాష్ట్రంలో రాజధానిగా ఉన్న అమరావతి ప్రాంతంలో ఉన్న ప్రజలు మరియు రాజధాని భూములు ఇచ్చిన రైతులు జగన్ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన 3 రాజధానులు విషయంలో తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అయితే మరోపక్క ఉత్తరాంధ్రలోని మరియు రాయలసీమ ప్రాంతములలో జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తూ మా ప్రాంతాలు కూడా డెవలప్ అయితే మా జీవితాలు కూడా బాగుంటాయి అంటూ సరైన నిర్ణయం జగన్ తీసుకున్నారని సంతోషిస్తున్నారు.

Image result for jagan"

ఇటువంటి నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో రైతులతో పాటు ఆ ప్రాంతంలోనే ఉండే నాగార్జున విశ్వవిద్యాలయానికి చెందిన నలుగురు యూనివర్సిటీ విద్యార్థులు తాజాగా యూనివర్సిటీ నుండి సస్పెండ్ అవ్వడం జరిగింది. సస్పెండ్ రావటానికి గల కారణాలు చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. జై అమరావతి అన్న నినాదాలు చేసినందుకే సస్పెండ్ చేసినట్లుగా చెబుతున్నారు. జై అమరావతి నినాదాలు చేసినందుకు నలుగురు విద్యార్థుల ను సస్పెండ్ చేశారు.

 

వెంటనే వారు వర్సిటీలోని హాస్టల్ రూంను ఖాళీ చేయాలని ఆదేశించారు. అంతేకాదు.. క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరు కావాలంటూ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో అమరావతి ప్రాంతంలో ప్రజలను రైతులను పోలీసులు చేత నిర్బంధించి విద్యార్థుల జీవితాలతో సస్పెండ్ చేసి ఆడుకోవటం భావ్యం కాదని చాలా పెద్ద తప్పు చేశారు అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ మేధావులు కామెంట్ చేస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news