పెగ్నెన్సీ సమయంలో ఇద్దరికి సరిపోయే ఆహారం తినాల్సినా పనిలేదట..?

-

ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఆ స్త్రీ ఎంత జాగ్రత్తగా ఉంటే పుట్టే బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటాడు. చాలామంది తెలిసి తెలియక కొన్ని తినకూడనివి ఎక్కువగా తింటారు. దానివల్ల వారి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. డెలివరీ తర్వాత కోలుకోవడానికి చాలా టైమ్ పడుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో చేయకూడని నాలుగు తప్పులేంటో నిపుణులు వివరిస్తున్నారు. అవేంటంటే..

ఎక్కువగా తినడం అవసరమా?

చాలా మంది గర్భంతో ఉన్న మహిళలకు ఇంట్లో వాళ్లు ఎప్పుడూ ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు. వాళ్లు తింటూనే ఉంటారు. మీరు వద్దన్నా.. వాళ్లు కామన్‌గా చెప్పే మాట ఇదే.. ఇపుడు నువ్వు ఇద్దరికి సరిపోయే ఆహారం తినాలి అని. పోషకాల విషయంలో అది నిజమే కానీ, ఆహారం ఎక్కువగా తీసుకోవడం మాత్రం అవసరం లేదు. ఎక్కువ తిండి తినడం వల్ల బరువు ఎక్కువగా పెరుగుతారు. దానివల్ల మధుమేహం, అధిక రక్తపోటు లాంటి సమస్యలు రావచ్చు.

అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ గైనకాలజిస్ట్ అండ్ అబ్‌స్టెట్రీషియన్ (ACOG) ప్రకారం.. ప్రెగ్నెన్సీ మొదటి త్రైమాసికంలో మన శరీరానికి మామూలు సమయం కన్నా ఎక్కువ కేలరీలు అవసరం లేదు. మనం తీసుకునే ఆహారం సరిపోతుంది. అలాగే వాంతులు, తల తిరగడం వంటి సమస్యల వల్ల సరిగ్గా ఆహారం తీసుకోకపోయినా మనం తీసుకునే కొద్దిపాటి ఆహారం పిండం ఎదుగుదలకు సరిపోతుంది.

రెండో త్రైమాసికంలో మాత్రం రోజుకు 300 కేలరీలు అవసరమవుతాయి. దానికోసం కూడా రోజుకు ఒకసారి అదనంగా ఒక స్నాక్ తినడం లేదా ఒక కప్పు పెరుగు లేదా యోగర్ట్, ఆహారంలో చికెన్ చేర్చుకుంటే చాలు.

మూడో త్రైమాసికంలో 300-500 kcal రోజుకు అవసరం. ఆకలి కూడా ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి రోజూవారీ ఆహారంలో మరొక అదనపు స్నాక్ ఏదైనా చేర్చుకుంటే చాలు.

ఏం తింటున్నామో ముఖ్యం:

ఎంత తింటున్నామన్నది కాదు, ఏం తింటున్నామో ముఖ్యం. బరువు పెరుగుతామనే భయం లేకుండా పోషకాలున్న ఆహారం తీసుకోవాలి. ఎక్కువ పంచదార ఉన్న డ్రింకులు, ప్యాక్ చేసి నిల్వ చేసిన చిరుతిండ్ల జోలికి పోకూడదు. దానికి బదులు చిరుధాన్యాలు, ఇంట్లో చేసిన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి.

వ్యాయామం కన్నా ముందు స్నాక్స్:

వైద్యుల సలహాతో వ్యాయామం చేయడం చాలా మంచిది. అలాగే వ్యాయామం చేసేటపుడు ఖాళీ కడుపుతో కన్నా కనీసం అరగంట ముందు ప్రొటీన్, కార్బోహైడ్రేట్లున్న స్నాక్స్ తీసుకోవాలి. యోగర్ట్‌లో యాపిల్ ముక్కలు, అరటిపండ్లు పీనట్ బటర్‌ కలిపి తీసుకున్నా మంచిదే.

ఒత్తిడి వద్దు:

ఉదయం లేవగానే వాంతులు, తల తిరగడం లాంటి సమస్యలుండొచ్చు. వాటివల్ల ఒత్తిడి తీసుకోకండి. కొన్ని సార్లు కొన్నింటి వాసనలు నచ్చక పోషకాలున్నా వాటిని పక్కన పెట్టేస్తాం. ఎలాంటి పోషకాలు లేని ఆహారం నోటికి రుచికి ఉందని ఎక్కువగా తినేస్తాం. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. దానికి బదులుగా సమస్య కాస్త నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. వాసనలు పడకపోతే ఉడికించిన కూరగాయలు, పాస్తా, చికెన్, చేపలు ఆహారంలో చేర్చుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version