ఇయర్ బడ్స్ వాడితే అంతే సంగతులు…!

-

జనాలు కాలం మారుతున్న కొద్దీ, సాంకేతికత వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. ఏ పని అయినా సులువుగా అయిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు జనం. దీనితో టెక్నాలజీ కూడా వాళ్లకు అనుగుణంగానే అందుబాటులోకి వస్తుంది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ముఖ్యంగా సెల్ ఫోన్ ఆధారిత పరికరాల విషయంలో ఇది అక్షరాలా నిజమవుతూనే ఉంది అనే చెప్పవచ్చు.

ఇటీవలి కాలంలో చూస్తే… ఇయర్ ఫోన్స్ ప్లేస్ లో ఇయర్ బడ్స్ అంటూ కొత్తవి వచ్చాయి. ఫోన్ తీసి గుచ్చుకుని, చెవిలో పెట్టుకునే బదులు ఇయర్ బడ్స్ ని రెండు చెవుల్లో పెట్టుకుని వాడుతున్నారు జనం. బ్లూటూత్ ఆధారంగా పని చేసే వీటిని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేస్తూ వస్తున్నాయి కంపెనీలు. వైర్డ్‌ ఇయర్‌ఫోన్లతో పోలిస్తే వైర్‌లెస్‌ ఇయర్‌ బడ్స్‌ కొద్దిగా నాణ్యత తక్కువగా ఉన్నా పని తీరు మాత్రం మెరుగ్గానే ఉంటుంది.

దీనితో వేలకు వేలు ఖర్చుచేసి జనం వాటిని కొనుక్కుని వాడుతున్నారు. అయితే అది మంచిది కాదు అంటున్నారు వైద్యులు. ఇయర్స్ బడ్స్ ని అరగంట లేదా గంట వాడటం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదులే గాని, రోజు అంతా వాడితే మాత్రం ఇబ్బందులు రావడం అనేది మొదలు అవుతుంది అని, వినికిడి లోపం వస్తుందని, చెవులకు అనేక రకాల సమస్యలు వస్తాయని అంటున్నారు వైద్యులు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Latest news