వేడినీటిలో తేనె కలుపుకుని తాగుతున్నారా..డేంజరే..!

-

బరువు తగ్గాలని చాలా మంది రోజు ఉదయాన్నే వేడినీటిలో హనీ, లెమన్‌ వేసుకుని తాగుతుంటారు. బరువు తగ్గాలనుకునే వారికే కాదు.. అందరికీ ఈ అలవాటు మంచిదే. ఆస్తమా ఉన్నవారికి మరీ మంచిది. తేనెను చాలా రకాలుగా వాడుతుంటాం. అయితే తేనెను కరెక్టుగా వాడితేనే అది మనకు మేలు చేస్తుంది..లేదంటే..విషంలా మారుతుందని నిపుణులు అంటున్నారు. తేనెను వాడకూడని విధానాలు కూడా కొన్ని ఉన్నాయి.. అలాకానీ మీరు తేనెను వాడితే ప్రాణాలమీదకు తెచ్చుకున్నట్లేనట..! ఇంతకీ తేనెను ఎలా వాడొద్దంటే..

తేనెలో క్యాల్షియం, ఐరన్‌, సోడియం, ఫాస్ఫరస్‌, సల్ఫర్‌, పొటాషియం వంటి మినరల్స్‌‌తో పాటు, విటమిన్‌ సి, విటమిన్‌ బి వంటి విటమిన్లు, ప్రొటీన్లు కూడా ఉంటాయి. అయితే.. తేనె వేడి నీటితో తీసుకుంటే ఒక విధంగా.. చల్లని నీటితో తీసుకుంటే ఇంకో విధంగా ప్రభావం చూపుతుంది. అయితే గోరువెచ్చని నీటితో తేనె కలుపుకుని తాగే వారు జర జాగ్రత్తగా ఉండాలి…

తేనెను వేడి నీటిలో వేస్తే విషంగా మారుతుందని, అందువల్ల దానిని వేడినీటిలో, మరిగేనీటిలో వేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదం ప్రకారం తేనెను వేడి చేయడం లేదా ఉడికించడం వంటివి అస్సలు చేయకూడదు. 40 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకన్నా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వేడి చేయడం వల్ల తేనెలో రసాయన మార్పులు జరుగుతాయి. వేడి తేనె తాగడం వల్ల విషపూరిత అణువులు జీర్ణ వ్యవస్థపై చెడు ప్రభావం చూపుతాయి. దీనివల్ల ఉదర సంబంధిత సమస్యలు వస్తాయి. కాబట్టి తేనెను వేడి చేయకుండా గది ఉష్ణోగ్రత వద్ద ఉన్నప్పుడే తీసుకోవాలని నిపుణులు తేల్చి చెప్పారు.

ముఖ్యంగా డైలీ హాట్‌ వాటర్‌లో తేనె వేసుకుని తాగేవాళ్లు.. చాలా జాగ్రత్తగా ఉండండి. పొరపాటున నీళ్లు కాస్త ఎక్కువ వేడి అయితే కాస్త చల్లారే వరకూ ఆగండి. అప్పుడే తేనె కలుపుకుని తాగాలి.. హరీబరీగా అదే వేడినీటిలో తేనె వేసేస్తే పైన చెప్పినట్లు సమస్యలు రావొచ్చు. ఒకేసారి ప్రభావం చూపకపోవచ్చు కానీ మీరు అదే ప్రాక్టీస్‌ ఫాలో అయితే దీర్ఘకాలంలో కచ్చితంగా నష్టాన్ని చూడకతప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news