ఫ్రిడ్జ్ లో గుడ్లు ఎప్పుడూ పెట్టొద్దు..!

చాలా మంది గుడ్లను కొనుగోలు చేసి వాటిని ఫ్రిడ్జ్ లో ఉంచుతారు. అయితే గుడ్లని ఫ్రిడ్జ్లో వుంచచ్చా లేదా అనేది ఇప్పుడు మనం చూద్దాం. కొందరు ఒక్కొక్కసారి ఎక్కువ గుడ్లు తెచ్చుకొని ఫ్రిడ్జ్ లో ఉంచి ఒకటి లేదా రెండు రోజుల్లో వండుకుంటారు.

అయితే మీకు తెలుసా..? ఫ్రిడ్జ్ లో గుడ్లు పెట్టడం వల్ల నష్టాలు కలుగుతాయని. అయితే ఎటువంటి కష్టాలు కలుగుతాయి అనేది చూస్తే..

టెంపరేచర్:

అయితే ఫ్రిజ్ లో గుడ్లు పెట్టడం వల్ల టెంపరేచర్ మారుతుంది. దీనితో గుడ్ల రంగు మరియు రుచి లో కూడా మార్పు వస్తుంది. ఒకవేళ కనుక మీరు టెంపరేచర్ ని పెంచి ఫ్రిజ్ లో గుడ్లని పెడితే గుడ్లు పాడైపోవడానికి కూడా అవకాశం ఉంది.

గుడ్లు విరిగిపోవడం:

మీరు కనుక ఫ్రిడ్జ్ లో గుడ్లు పెడితే ఉడికించేటప్పుడు అవి విరిగిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. వెంటనే ఉడికించే వాటితో పోలిస్తే ఫ్రిడ్జ్ లో తీసి ఉడికించినవి త్వరగా విరిగిపోయే అవకాశం ఉంది.

బ్యాక్టీరియా:

ఒకవేళ కనుక ఫ్రిడ్జ్ లో గుడ్లని పెడితే వాటిని తీసిన తర్వాత బ్యాక్టీరియా పెరిగిపోతుంది. త్వరగా పాడైపోయే అవకాశం కూడా మనం గమనించవచ్చు. అయితే బయట ఉండడం కంటే కూడా ఫ్రిడ్జ్ లో పెట్టడం చాలా మంచిది.

కానీ ఎక్కువ కాలం దానిని ఉంచడం వల్ల ఈ నష్టాలు కలుగుతాయి. అలానే ఎక్కువ కాలం ఫ్రిడ్జ్ లో ఉంచడం వల్ల దానిలో ఉండే పోషకాలు కూడా తగ్గిపోతాయి.