ప్రస్తుత జీవన శైలిలో ప్రతి పది మందిలో 8 మందికి షుగర్, బీపీ సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారు. షుగర్ (డయాబెటిస్) బిపి (హైపర్ టెన్షన్) వంటి వ్యాధులు శరీరంలో వివిధ అవయవాలపై ప్రభావం చూపుతాయి. మన శరీరంలో ఏదైనా అనారోగ్యం సంభవిస్తే, శరీరం అవయవాలు కొన్ని సంకేతాలను ఇస్తాయి. అలాగే కళ్ళు ఈ వ్యాధుల సంకేతాలను చూపించే ముఖ్యమైన భాగం. కళ్ళల్లో షుగర్ బిపి సంబంధించిన లక్షణాలు స్పష్టంగా కనిపెట్టవచ్చు. అదెలా అనేది మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
డయాబెటిస్: షుగర్ వ్యాధి ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయి అధికంగా ఉంటుంది దీనివల్ల కంటి రెట్టినాలో రక్తనాళాలు దెబ్బ తినవచ్చు దీనిని డయాబెటిక్ రెటినోపతి అంటారు. ఈ పరిస్థితుల్లో కళ్ళలో రక్తస్రావం, నీరు కారడం, కొత్త రక్తనాళాలు ఏర్పడడం వంటివి జరుగుతాయి.ఈ లక్షణాలు బయటకు కనిపించకపోయినా కంటి పరీక్షల ద్వారా ఈ మార్పులను గుర్తించవచ్చు. దృష్టి మసకబారడం, చిన్నచిన్న రక్తపు మచ్చలు కనిపించడం. రాత్రి సమయాలలో చూపు తేడా రావడం, వంటి సమస్యలు డయాబెటిక్ రెటినోపతి యొక్క సంకేతాలు కావచ్చు. ఇలాంటి లక్షణాలు ఏదైనా కనిపిస్తే వెంటనే కంటి పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం.
హైపర్ టెన్షన్ : సాధారణంగా బీపీ రక్తనాళాలు ఒత్తిడి వల్ల సంభవిస్తుంది. హైపర్ టెన్షన్ అధిక రక్త పీడనం కంటి రెటీనాలో రక్తనాళాలను దెబ్బతీస్తుంది. దీనినే హైపర్ టెన్సివ్ రెటీనోపతి అంటారు. రక్తనాళాలు సన్నబడడం, గట్టిపడటం, కంటిలో రక్తస్రావం కారడం వంటి సమస్యలు రావచ్చు. కంటి సమస్యలు, తలనొప్పి, కళ్ళలో ఒత్తిడి వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇది తీవ్రమైన సందర్భాలలో రెటీనా వాపు ఏర్పడుతుంది దృష్టి పూర్తిగా దెబ్బతింటుంది. ఇలాంటి సమస్యలు ఏమైనా తలెత్తితే వెంటనే దగ్గరలోని కంటి వైద్యుని సంప్రదించాలి.

గుర్తించడం ఎలా?: కంటి వైద్యుడు రెటీనా పరీక్షలు, ఫండస్ ఫోటోగ్రఫీ వంటి పరీక్షల ద్వారా ఈ సమస్యలను గుర్తిస్తారు. ఈ పరీక్షల రక్తనాళాల మార్పులు రక్తస్రావం, వంటి వాటిని స్పష్టంగా చూపిస్తాయి.
నివారణ: షుగర్ మరియు బిపి నియంత్రణలో ఉంచడం ఎంతో ముఖ్యం. ఆరోగ్యకరమైన జీవన శైలి క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా కంటి సమస్యలు నివారించవచ్చు. ముందస్తు చర్యల ద్వార చికిత్స చేయించుకుంటే కంటి నష్టాన్ని తగ్గించవచ్చు.
ఇక కళ్ళు నిజంగా షుగర్ బీపీ వంటి వ్యాధుల సంకేతాలను దాచి ఉంచుతాయి. కంటి పరీక్షలు వీటిని ముందస్తు గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
(గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే ఏదైనా సమస్య ఉంటే వైద్యున్ని సంప్రదించండి.)