ఫ్యాటీలివర్‌తో హార్ట్‌కు డేంజరే!

ఫ్యాటీ లివర్‌ను సాధరణంగా ఆల్ట్రా సౌండ్‌ పద్ధతిలోనే తెలుసుకోగలుగుతాం. మన లివర్‌కు ఫ్యాట్‌ పేరుకుని పోయే విధానాన్ని ఫ్యాటీ లివర్‌ అంటారు. అయితే ఇటీవల జపాన్‌ వైద్య పరిశోధకులు ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌ ద్వారానే నాలుగు రెట్లు గుండె సంబంధిత వ్యాధులకు గురవుతున్నారని తెలిపింది. ఇది అన్ని వయస్సుల వారిలో మగ, ఆడవారి ఇద్దరిలో ప్రపంచవ్యాప్తంగా ఒకే రకమైన వ్యాధిగా నిర్ధారించారు. దీనివల్ల హృదయ నాళాల్లోని ధమనులలో పెరుకుని, రక్తనాళాలను సన్నగా చేస్తుంది. దీంతో గుండె, మెదడు ఇతర శరీర భాగాలకు రక్త సరఫరాను తగ్గిస్తుంది. ఎక్కువ శాతం ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్న రోగులు గుండె సంబంధిత వ్యాధులతో అతి చిన్న వయస్సులోనే మరణిస్తున్నారు.

 

ఇది సాధరణంగా ఆల్కహాల్‌ సేవించే వారిలో కనిపిస్తుంది. అదేవిధంగా మద్యం సేవించని వారిలో కూడా ఉంటుంది. దీన్ని (NAFLD) నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ అంటారు. ఫ్యాటీ లివర్‌ వల్ల లివర్‌కు ఎక్కువ డ్యామేజ్‌ కాకున్నా హార్ట్‌ అటాక్‌ సమస్యలు పెరుగుతున్నాయి. ఫ్యాటీ లివర్‌ ఉందని తెలిస్తే.. ఎంత శాతం లివర్‌లో కొవ్వు పేరుకుంది, కాలేయం వర్కింగ్‌ కండిషన్‌ ఎలా ఉందో తెలిపే టెస్టులు చేయాల్సి ఉంటుంది. దీన్నే ‘లివర్‌ ఫైబ్రోస్కాన్‌’ అంటారు. కేవలం 10 నిమిషాల్లో ఎటువంటి నొప్పి లేకుండా సులభంగా, కచ్చితమైన ఫలితాన్ని తెలుసుకోవచ్చు. NAFLD సాధరణంగా ఒబేసిటీ, డయాబెటీస్, హైపర్‌టెన్షన్‌ వల్ల వస్తుంది. దీన్ని ‘లైఫ్‌స్టైల్‌ డిసార్డర్‌’ అని కూడా అంటారు. ఎక్సర్‌సైజ్‌ చేయకపోవడం, ఎక్కువ కేలరీ ఫుడ్‌ను తీసుకోవడం వల్ల ఒబేసిటీ సమస్య వస్తుంది. దీనివల్ల లివర్‌లో కొవ్వు పేరుకుపోతుంది. డయాబెటీస్‌ రోగుల్లో రెండు పద్ధతుల్లో వస్తుంది. రోగిలో ఇన్సూలిన్‌ లెవల్‌ పెరిగినపుడు వస్తుంది.

ప్రతిరోజూ ఎక్సర్‌సైజ్‌ చేయాలి. వెయిట్‌ లాస్‌ అవ్వడం వల్ల కూడా దీన్ని సులభంగా చికిత్స చేయవచ్చు. భారత్‌లో ఎక్కువశాతం డయాబెటీస్‌ రోగులు ఉన్నారు. జీన్స్‌ వల్ల కూడా ఈ వాధి వస్తుంది. మన దేశంలోని వాతావరణం, ఎక్సర్‌సైజ్‌ అవవాటు లేకపోవడం వల్ల ఇటువంటి దుష్పరిమాణాలు ఏర్పడుతున్నాయి. ఎక్కువ రోజులు బతికి, హెల్తీగా ఉండాలంటే రెగ్యులర్‌ ఎక్సర్‌సైజ్‌ చాలా అవసరం. మంచి వైద్యులు కూడా ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. డైట్‌ మెయింటెనెన్స్, ఫిట్నెస్‌లలో సలహాలు అందిస్తారు. వాటిని పాటిస్తూ మన కాలేయం, గుండెను ఆరోగ్యవంతం రక్షించుకుందాం.