మీకు దగ్గరలో పావురాలు ఉన్నాయా..? అయితే లివర్ డ్యామేజ్ అవ్వొచ్చు..!

-

చాలామంది కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ముఖ్యం. ఈరోజుల్లో చాలామంది అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. కాలేయ సంబంధిత సమస్యలు రావడానికి పావురాలు కూడా కారణం అని తెలుస్తోంది. పావురాలకి సంబంధించి ఒక వార్త నెట్టింట కూడా వైరల్ అవుతోంది. పావురాలని చాలామంది పెంచుతూ ఉంటారు. కొంతమంది దగ్గర్లో పావురాలు ఉన్న చోటకి వెళ్లి ఆహారం వేస్తూ ఉంటారు. లేదంటే మేడపై పావురాలకు ఆహారం వేయడం, నీళ్లు ఇవ్వడం ఇలాంటివి చేస్తూ ఉంటారు.

అయితే పావురాలు వలన క్యాన్సర్ వచ్చే సమస్య ఉందని తెలుస్తోంది. అయితే ఇళ్లల్లో పావురాలు ఉండడం వలన వృద్ధులకు, పిల్లలకు ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడే వాళ్ళకి వ్యాధులు రావచ్చు. పావురాలు ఎగిరినప్పుడు వాటి రెట్టల వలన ఇన్ఫెక్షన్ గాలిలోకి వ్యాపిస్తుందట. అయితే పావురాల వల్ల వచ్చే ఈ దుమ్ము అలాగే ఇన్ఫెక్షన్స్ వంటివి మనుషులకు శ్వాస ద్వారా కలుగుతాయట.

పావురాలు రెట్టలలో రెండు రకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయని.. ఒకటి ఫంగల్ ఇంకోటి బ్యాక్టీరియా అని తెలుస్తోంది. ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళని ఇది ఎక్కువగా బాధిస్తుంది. అలాగే ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నవాళ్ళకి కూడా ఈ వ్యాధి కలిగి ఇబ్బందిని ఎదుర్కోవాల్సి ఉంటుందట. కనుక వీటితో జాగ్రత్తగా ఉండడం మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version