రోజూ పొద్దున్న గానీ సాయంత్రం గానీ వాకింగ్ అలవాటున్నవారు 6-6-6 రకం నడక గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. వాకింగ్ అలవాటు చేసుకునే వారు సైతం దీని మీద దృష్టి పెట్టాలి. ముందుగా 6-6-6 రకం అంటే ఏంటో తెలుసుకుందాం.
ఉదయం 6 గంటలకు లేదా సాయంత్రం 6 గంటలకు 60 నిమిషాల పాటు నడవడం.
ఇంకా నడక మొదలు పెట్టేముందు 6 నిమిషాలపాటు, అలాగే నడక పూర్తయిన తర్వాత మరో 6నిమిషాల పాటు కూల్ డౌన్ వ్యాయామాలు చేయడం.
ఈ ప్రాసెస్ మొత్తాన్ని 6-6-6 వాకింగ్ అంటున్నారు.
ఈ రకం వాకింగ్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయంటే..?
60నిమిషాల పాటు డైలీ వాకింగ్ చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాదు శరీర బరువు కంట్రోల్ లో ఉంటుంది. రోజూ ఈ విధంగా చేయడం వల్ల శరీర ఆరోగ్యం బాగుంటుంది.
చాలామందికి పొద్దున్న లేచి తీరిక ఉండదు, అలాంటి వాళ్ళు సాయంత్రం నడుస్తారు. సాయంత్రం పూట నడవడం వల్ల నిద్ర సరిగ్గా పడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. అంతేకాదు.. శరీరంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ముఖ్యంగా జీర్ణశక్తి పెరుగుతుంది.
పొద్దున్న వాకింగ్ చేయడం వల్ల కలిగే లాభాలు:
ఉదయం 6గంటలకు వాకింగ్ చేయడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. ఈ సమయంలో శరీరంలోని క్యాలరీలు బాగా కరిగిపోతాయి. అనవసరమైన ఒత్తిడి యాంగ్జయిటీ తగ్గి మానసికంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు.
వార్మప్ ఎందుకు చేయాలంటే?
నడక మొదలు పెట్టేముందు 6నిమిషాలు వార్మప్ చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. కండరాల్లోకి రక్త ప్రసరణ జరుగుతుంది. దీనివల్ల ఎక్సర్ సైజ్ సులభంగా చేయవచ్చు.
కూల్ డౌన్ ఎందుకు చేయాలంటే?
అప్పటివరకు వ్యాయామం చేసి అలసిపోయిన శరీరాన్ని ప్రశాంతంగా మార్చడానికి శరీర ఉష్ణోగ్రతను స్థిరం చేయడానికి కూల్ డౌన్ ఎక్సర్సైజ్ చేయాలి.