రోజూ వ్యాయామం చేయడం కష్టమని భావించే వాళ్ళు మార్నింగ్ వాక్ తో సరిపెడుతుంటారు. కొందరు సూర్యుడు ఉదయించక ముందే నడక మొదలు పెడితే, మరికొందరేమో సూర్యుడు పైకి వచ్చిన తర్వాత మార్నింగ్ వాక్ చేస్తారు. అయితే మార్నింగ్ వాక్ చేయడానికి ఏది సరైన సమయమో మీకు తెలుసా..?
సూర్యుడు ఉదయించక ముందు మార్నింగ్ వాక్ చేస్తే:
ఈ సమయంలో వీధులన్నీ ప్రశాంతంగా ఉంటాయి. ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా ఉంటుంది కాబట్టి మీరు తాజాగా ఫీల్ అవుతారు. అంతేకాదు.. ఈ సమయంలో ఎక్కువ దూరం నడవొచ్చు. ఉదయం ఐదు నుంచి ఆరు గంటల లోపు చేస్తే బాగుంటుంది.
ఆరు తర్వాత వాకింగ్ చేస్తే:
సూర్యుడు ఉదయించక ముందే వాకింగ్ చేయాలంటే అందరికీ సాధ్యం కాదు. అలాంటి వాళ్ళు సూర్యుడు ఉదయించిన తర్వాత వాక్ చేస్తారు. ఇది కూడా మంచి సమయమే. ఈ సమయంలో నడవడం వల్ల సూర్యుడి లేలేత కిరణాలు ఒంటిమీద పడి ఉత్తేజితంగా ఫీల్ అవుతారు. అదనంగా విటమిన్-డి శరీరానికి దొరుకుతుంది. ఉదయం 6 నుంచి 7 గంటల లోపు వాక్ చేయాలి.
ఉదయం 8 తర్వాత వాకింగ్ చేస్తే:
మార్నింగ్ చల్లగా ఉంటుంది కాబట్టి కొందరి శరీరాలు చల్లదనాన్ని తట్టుకోలేవు. అలాంటివాళ్లు 8 తర్వాత వాకింగ్ చేయవచ్చు. ఈ సమయంలో కూడా విటమిన్ డి దొరుకుతుంది. 8:00 నుండి 9:00 లోపు మార్నింగ్ వాక్ అయిపోవాలి.
వాకింగ్ చేసే ముందు జాగ్రత్తలు:
నిద్రలోంచి మేలుకోగానే వాకింగ్ కి వెళ్ళకూడదు. శరీరాన్ని వార్మప్ చేసుకోవాలి. దానికోసం పది నిమిషాల పాటు యాక్టివిటీ చేయాలి. అంతేకాదు.. వాకింగ్ చేసేటప్పుడు మీ దగ్గర కచ్చితంగా వాటర్ బాటిల్ ఉంచుకోండి.