ఇంటిని విషపూరితం చేసే ఈ వస్తువులను ఇప్పుడే బయట పడేయండి.

-

ఇంటిని విషపూరితం చేసే వస్తువులు ఏముంటాయబ్బా అనే ఆలోచన మీకు వచ్చి ఉండవచ్చు. మార్కెట్లో దొరికే రకరకాల వస్తువులను ఇంట్లోకి తెచ్చుకుంటాం. కొన్నిసార్లు వాటిని వాడకుండా అలానే పడవేస్తాము. వాటి ఎక్స్ పైరీ అయిపోయిన సంగతి మర్చిపోతాం. అలా ఆ వస్తువు కారణంగా ఇల్లు విషపూరితం అవుతుంది.

ప్రస్తుతం ఎలాంటి వస్తువులను ఇంట్లో నుంచి బయట పడవేయాలో తెలుసుకుందాం.

పాత పరుపులు:

మంచం మీద వేసే పరుపులు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. అయితే మరీ పాతవైన వాటిని మాత్రం మార్చేయండి. పాత పరుపులలో దుమ్ము పురుగులు చేరే అవకాశం ఉంది. దానివల్ల బ్యాక్టీరియా పెరిగి దానిమీద నిద్ర సరిగ్గా పట్టదు. నడుము నొప్పి వచ్చే అవకాశం ఎక్కువ.

ప్లాస్టిక్ కటింగ్ బోర్డ్:

దాదాపు ప్రతీ కిచెన్ లో ప్లాస్టిక్ ఛాపింగ్ బోర్డు కనిపిస్తుంది. ఇది చాలా డేంజర్. దీనిమీద కూరగాయలను ముక్కలుగా కోయడం వల్ల ప్లాస్టిక్ బోర్డ్ కూడా చిన్నచిన్న ముక్కలుగా కట్ అవుతుంది. ఇది శరీరానికి చాలా ప్రమాదాన్ని కలగజేస్తుంది.

బూజు పట్టిన వస్తువులు:

పుస్తకాలు కానీ ఇతర వస్తువులు కానీ బూజు పట్టినట్లు కనిపించినట్లయితే వాటిని వాడకపోవడమే మంచిది. ముఖ్యంగా ఎన్నో రోజులుగా వాడని వంట పాత్రలు బూజు పడితే పక్కన పడేయటమే ఉత్తమం.

ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్:

వీలైనంత తొందరగా ఈ బాటిల్స్ ని పక్కన పడేయండి. వీటి బదులు స్టెయిన్ లెస్ స్టీల్ బాటిల్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ని కేవలం ఒక్కసారి మాత్రమే వాడాలి. రిపీటెడ్ గా వాడకూడదు.

సువాసన వెదజల్లే క్యాండిల్స్:

మీ ఇంట్లో వాడని సెంటెడ్ క్యాండిల్స్ ఉంటే వెంటనే పక్కన పడేయండి. దానిలో విషపూరిత రసాయనాలు ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version