మీ రోజంతా సంతోషంగా ఉండాలంటే తప్పకుండా ఉదయాన్నే ఎంతో మంచి ప్రారంభం కూడా జరగాలి. ప్రతి ఒక్కరు జీవితంలో ఎంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు మరియు ఎలాంటి ఇబ్బంది లేకుండా పనులు కొనసాగాలని ఆశిస్తారు. అయితే కొన్ని పనులు ఉదయాన్నే చేయడం వలన రోజంతా ఎంతో సంతోషంగా గడపవచ్చు. ఎప్పుడైతే మీ రోజు ప్రారంభంలో సానుకూల శక్తి ప్రవహిస్తుందో ఆ రోజంతా ఎంతో ఆనందంగా మరియు ప్రశాంతంగా కొనసాగుతుంది. కనుక ఇటువంటి పనులను నిద్రలేచిన వెంటనే చేయాలి. ఇలా చేస్తే ఎంతో మార్పుని గమనిస్తారు మరియు ప్రశాంతతను పొందుతారు. ప్రతిరోజు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాలి, అంటే సూర్యోదయం అవ్వకముందు నిద్ర లేవడం. సూర్యోదయానికి గంట లేక గంటన్నర సమయం ముందు నిద్ర లేవడం వలన ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. దీన్నే బ్రహ్మ ముహూర్తం అంటారు. ఈ సమయంలో నిద్ర లేవడం వలన ఎంతో మంచి జరుగుతుంది.
ముఖ్యంగా ఆలస్యంగా నిద్రలేచేవారు ఈ సమయానికి నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. చాలామంది నిద్రలేచిన తర్వాత స్మార్ట్ ఫోన్లను ఎక్కువగా చూస్తూ ఉంటారు. అలా కాకుండా నిద్రలేచిన తర్వాత రెండు చేతులకు నమస్కారం చేసుకోవాలి. ఇలా చేసినప్పుడు ఈ శ్లోకాన్ని చదవడం వలన ఎంతో మంచి జరుగుతుంది. కరాగ్రె వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి.. కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనం.. ఇలా చదవడం వలన ఎంతో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. దీని తర్వాత భూదేవికి నమస్కారం చేయాలి. ఈ విధంగా మీ రోజును ప్రారంభం చేస్తే ఎంతో హాయిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజంతా ఉండవచ్చు.
ఉదయం నిద్ర లేచిన తర్వాత మృదంగం, బంగారం, అద్దం లేక ఏవైనా మనిని చూడడం వలన ఎంతో మంచి జరుగుతుంది అని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా అగ్నికి కూడా నమస్కారం చేసుకోవడం వలన ఎంతో మంచి జరుగుతుంది. ఈ విధంగా నిద్ర లేచిన తర్వాత ఇటువంటి పనులు చేస్తే మీ రోజంతా ఎంతో సంతోషంగా కొనసాగుతుంది. కొంతమంది భూదేవికి నమస్కారం చేసుకోవడంతో పాటు తల్లిదండ్రులకు కూడా నమస్కారం చేయాలి అని చెప్తూ ఉంటారు. ఇలా చేయడం వలన కూడా ఎంతో మంచి జరుగుతుంది. కనుక ఈ పనులను తప్పకుండా అలవాటు చేసుకోండి దానితో రోజంతా ఆనందంగా గడుపుతారు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు.