తెలంగాణ ప్రజలు పెట్టే శాపాలకు సీఎం రేవంత్ రెడ్డి కుక్క చావు చస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఓట్లు వేసి నిన్ను గెలిపించారు. ఆరు గ్యారెంటీల పేరుతో వారిని మోసం చేశావని.. ఇవాళ వాళ్లు పెట్టే శాపనార్థాలకు రేవంత్ కుక్క చావు చస్తాడని వ్యాఖ్యానించారు కౌశిక్ రెడ్డి. రాష్ట్రంలోని పిచ్చి కుక్కలకు రేవంత్ రెడ్డి అధ్యక్షుడు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం ప్రజలు ఏవిధంగా ఉన్నారంటే.. ఆరు గ్యారెంటీల హామీలు ప్రజలకు ఏవిధంగా ఇచ్చావని ప్రశ్నించారు. ప్రజలను నమ్మించావు.. నిన్ను నమ్మి ప్రజలు నీకు ఓటు వేస్తే.. ఇప్పుడు వారిని మోసం చేశావు. గ్యారెంటీగా చెబుతున్నాను. తెలంగాణ ప్రజలు పెట్టే శాపనార్థాల వల్ల రేవంత్ రెడ్డి తప్పక తగులుతుందని తెలిపారు.