The exciting Hindupuram municipal elections: హిందూపురంలో క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మున్సిపల్ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. హిందూపురం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం దిశగా ఎమ్మెల్యే బాలకృష్ణ అడుగులు వేస్తున్నారు. ఇక ఈ నెల 3న అంటే రేపు మున్సిపల్ కార్యాలయానికి ఎన్నికల్లో పాల్గొనేందుకు బాలకృష్ణ, ఎంపీ పార్థసారథి రానున్నారు.
అటు ఇప్పటికీ టిడిపి కౌన్సిలర్లతో క్యాంప్ కొనసాగుతోంది. వైసీపీ నుంచి టిడిపిలోకి వెళ్లిన 14 మంది కౌన్సిలర్లకు విప్ జారీ అవకాశాన్ని వ్తెసీపీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ లెక్క ప్రకారం… హిందూపురం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం దిశగా ఎమ్మెల్యే బాలకృష్ణ అడుగులు వేస్తున్నారని అంటున్నారు. మరి రేపు ఏం జరుగుతుందో చూడాలి. ఇది ఇలా ఉండగా… హిందూపురం నుంచి 3 సార్లు బాలకృష్ణ గెలిచిన సంగతి తెలిసిందే.