ఎముకలు ధృడంగా ఉండాలంటే టాబ్లెట్ తో పనిలేకుండా తీసుకోవాల్సిన ఆహారాలు..వాడే విధానం

-

ఎముకలు సాధారణంగానే చాలా బాలంగా ఉంటాయి. ఎముకులగూడు మన శరీరం..206 ఎముకలు మన శరీరంలో ఉంటాయి. వీటిని కప్పి ఉంచడానికి 600 కండరాలు ఉంటాయి. వీటన్నింటిపైన తోలు కప్పబడింది. ఈరోజుల్లో చిన్నచిన్న వాటికే ఎముకుల విరిగిపోతుంటాయి. పూర్వం రోజుల్లో.. ఎంత ఎత్తునుంచి పడినా..ఒళ్లునొప్పులు తప్పా..ఎముకలు విరిగేవి కావు..కానీ ఈరోజుల్లో ఇలా ఎముకలు బలహీనంగా అవడానికి కారణం..కాల్షియం, ఫాస్పరస్ ఉన్న ఆహారం సరిపడా తీసుకోకపోవడం, విటమిన్ డీ లోపం కారణంగా..ఎముకలు గుల్లబారిపోవడం, రుచికోసం వాడే ఉప్పును అధికంగా తీసుకోవడం. వీటివల్ల ఎముకలు బలహీనపడతాయి. వీటిని సరిచేసుకోగలిగితే…6 నెలల్లోనే..ఎముకలు గట్టిపడతాయి. ఎముకకణం ఒకసారి పుడితే..25 సంవత్సరాలు బ్రతుకుతుంది. కానీ ఒక సంవత్సరం మన అలవాట్లు మార్చుకుంటే..ఎముకులు మళ్లీ గట్టిపడతాయి.

ఎముకలు అంటే..అందరూ చెప్పేది, మనం వినేది విటమిన్ Dలోపం వల్ల అని..అసలు విటమిన్ Dకి ఎముకలకు ఏంటి సంబంధం అని ఎప్పుడైనా ఆలోచించారా..విటిమిన్ D అనేది ఎండనుంచి వస్తుంది కదా..సిటీల్లో వారికి..ఈ లోపం ఎక్కువగా ఉంటుందట. ఈ విటమిన్ లోపించినప్పుడు..ఏం జరుగుతుందంటే..సాధారణంగా..మనం తినే ఆహారంలో ఉండే కాల్షియం ఒంటికి పట్టాలంటే..విటమిన్ డీ అవసరం. ఈ విటమన్ డీ లోపం ఏర్పడిందంటే..మనం అరలీటర్ పాలు తాగినా..అంతా మళ్లీ మలం ద్వారానే బయటకు వచ్చేస్తుంది. అలా కాల్షియం ఉన్న ఆహారాలు ఏం తీసుకున్నా..ఒంటికి పట్టవు.

అతిముఖ్యమైన అవసరం విటమిన్ డీతో ఏముంది అంటే….ఎముకలు బలంగా ఉండటానకి విటమిన్ డీ అంత అవసరం. ఇంకోటి ఉప్పుకు ఎముకలకు సంబంధం ఉందని పైన చెప్పుకున్నాం. ఉప్పు వల్ల బీపీ వస్తుందని తెలుసు కానీ..ఎముకల గుల్లబారతాయ్ అని చాలామందికి తెలియదు. రుచికోసం ఉప్పువేసుకుని తింటున్నాం..ఇది రక్తంలోకి వెళ్తుంది. రక్తంలో అధికంగా ఉప్పు ఉంటే..శరీరం ఊరుకోదు. ఆ ఉప్పును విసర్జింపచేయడానికి కిడ్నీలద్వారా పంపుతుంది….ఒట్టిగా ఉప్పు బయటకు వెళ్లలేదు..కాల్షియం తోడుంటే కానీ..ఉప్పు విసర్జింపబడదు..కాబట్టి ఉప్పును విసర్జింపచేయడానికి..మనం ఆహారం ద్వారా తీసుకున్న కాల్షియం బయటకువెళ్లిపోతుంది. తద్వారా.. రక్తంలో కాల్షియం స్థాయిలు తగ్గిపోతాయి. రక్తంలో కాల్షియం తగ్గిపోతే..శరీరం ఎముకల్లో కాల్షియం తెచ్చి రక్తానికి ఇస్తుంది..సో ఇలా అక్కడ కాల్షియం పోయి..ఎముకల గుల్లబారుతాయి.

కాల్షియం ఎముకలకు అందించాలంటే..ఎలాంటి ఆహారం తీసుకోవాలి

ఎముకలు బలంగా ఉండాలంటే..శరీరానికి కాల్షియం 20ఏళ్లుపై బడిన వారి నుంచి రోజుకు 450 మిల్లీగ్రాములు కాల్షియం కావాలి. 20ఏళ్ల లోపువారికి 600 మిల్లీగ్రాముల కాల్షియం కావాలి. గర్భిణీలకు, బాలింతలకు 900 మిల్లీగ్రాములు కాల్షియం కావాలి. కాల్షియం లోపిస్తే ఎముకల ఎలా తయారవుతాయంటే…మంచి బెల్లం గడ్డకు చీమలు పట్టిన బెల్లం గడ్డకు తేడా మనక తెలిసే ఉంటుంది కదా..అలా కాల్షియం లోపించిన ఎముక చీమలు పట్టిన బెల్లం గడ్డలా ఉంటుంది. ఎముకలు బలంగా ఉండాలని చాలా మంది పాలు తాగుతారు. నీళ్లు కలపని 100 గ్రాముల గేదెపాలల్లో 220మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. నీళ్లు కలిపిన గేదెపాలల్లో 120 మిల్లీగ్రాములు ఉంటుంది. ఆ‌వుపాలల్లో 120 మిల్లీ గ్రాములు ఉంటుంది. పాలకంటే కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారాలు ఉంటాయి..తోటకూర 100 గ్రాములు తీసుకుంటే..397 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది. 100 గ్రాముల రాగులల్లో 344 మిల్లీగ్రాములు కాల్షియం ఉంటుంది. పొనగంటి కూరలో 510 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది. మునగాకులో 440 మిల్లీ గ్రాములు ఉంటుంది. నువ్వుల్లో 1450 మిల్లీగ్రాములు, కరివేపాకు 830 మిల్లీగ్రాములు ఉంటుంది. పాలే ఎక్కువ కాల్షియం ఉందనుకుని ఉంటారుకదా..వీటిల్లో ఇంత ఎక్కువగా ఉంది. అన్నింటికంటే.. నువ్వుల్లో అధికంగా ఉంటుంది.

ఉదయం 10 నుంచి మధ్యాహ్నం లోపు ఎండలో వీపు భాగం ఎండతగిలేటట్లు..10-20 నిమిషాలు నుల్లోచండి. నల్లటివారు..అరగంట, గంటఉంటేకాని విటమిన్ తయరవుతుంది. అదే తెల్లటివారికి 20నిమిషాలు చాలు..ఎందుకంటే..మెలనిన్ అనేది నల్లగా ఉన్నవారి చర్మంలో ఎక్కువగా ఉంటుంది. సూర్యకిరణాలు పడినా..ఇది నిరోధిస్తుంది. సూర్యకరిణాలు చర్మానికి చేరకుండా చేస్తాయి. అందుకే వీళ్లు ఎక్కువ సేపు ఉండాలి.

ఎముకల నిర్మాణానికి ఒక మంచి లడ్డనూ ఎలా తయారుచేయాలో ఈరోజు చూద్దాం

పాలకంటే 13రెట్లు కాల్షియం ఉన్న ఆహారం నువ్వులు. కాల్షియం మాత్రలు వేసుకోవాల్సిన పనిలేకుండా ఈ ఒక్క నువ్వుల ఉండను రోజుకు ఒకటి తింటే చాలు.

కావల్సిన పదార్థాలు:

తెల్ల నువ్వులు200 గ్రాములు, ఖర్జూరం పేస్ట్ 200 గ్రాములు, తేనె 2 స్పూన్లు, యూలకపొడి కొద్దిగా. మీగడ కొద్దిగా

తయారుచేసే విధానం:

ముందుగా నువ్వులను దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాతా పొయ్యుమీద ఒక పాత్రలో మీగడవేసి..ఆ తర్వాత ఖర్చూజం పేస్ట్ , తేనే, యాలుకల పొడి వేయండి. కాసేపటికి వేయించిన నువ్వులు అందులో వేయండి. ఇవి పూర్తిగా కలిసేలా తిప్పండి. ఆ తర్వాత మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకోవడే..అంతే..అందరూ ఈ ఉండను తింటే సమృద్ధిగా కాల్షియం అందుతుంది..రోజూ భోజనం తర్వాతా లడ్డూను తినటం అలవాటు చేసుకుంటే చాలు..మంచి ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.

కాల్షియం తక్కువుగా ఉన్నవారికి, ఎముకలు బలహీనంగా ఉన్నవారికి నువ్వులు చాలు. నువ్వులతో పోలిస్తే..మరే ఇతర ఆహారం కూడా సరిరాదు..చాలామంది వేడిచేస్తాయిని నువ్వులు తినరు. అసలు వేడిచేసే గుణం నువ్వుల్లో లేదు. మీ శరీరంలో సరిపడానీళ్లు లేక వేడిచేస్తుంది. నువ్వులు బాగా తింటే ఎముకలు దృఢంగా ఉంటాయి. నువ్వులను ఐఏ రూపంలో వాడినా వేడి చేయదు. నువ్వులను వేపి పౌడర్ గా చేసి..కూరల్లో చల్లుకుని తినొచ్చు, దోరగా వేయించి ఖర్జూరంతో కలిపి లడ్డూచేసుకోవచ్చు, వీటన్నింటికంటే..నువ్వులు బాగా శరీరానికి పట్టాలంటే..నువ్వులను 8 గంటలపాటు నానపెట్టి విడిగా తినాలి..అంటే..ఏ ధాన్యాలతోనూ కలిపి తినొద్దు. కొంతమంది మొలకెత్తిన విత్తనాలతో కలిపి తింటారు. అలా అసలు చేయకూడదు. నువ్వులను బాగా నమిలి తినాలి.

గర్భీణీలు నువ్వులు తింటే..గర్భం పోతుందని అని చాలామంది అంటారు. అసలు నువ్వులు గర్భిణీలకుచేసినంత మేలు వేరేఎ‌వరికి చేయవు. గర్భణీలకు కాల్షియం ఎక్కువగా కావాలి. గర్భణీకి ఒకరోజుకు 900 మిల్లీగ్రాములు కావాలి. అంత ఎక్కువగా కాల్షియం రావాలంటే..కచ్చితంగా నువ్వుల ఉండ తినాలి అంటున్నారు ప్రకృతివైద్య నిపుణులు. చాలామంది అపోహలో ఉండి మంచి ఆహారాన్ని వదిలేస్తున్నారు. అందరూ నువ్వులను విరివిగా వంటల్లో వాడుకుంటే..ఏజ్ పెరిగాక..వచ్చే మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు లాంటి సమస్యలు కూడా రావు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version