థైరాయిడ్ కంట్రోల్ అవ్వాలా? అయితే ఈ ఆహార పదార్థాలను తీసుకోండి.. వీటిని మాత్రం వద్దు..!

-

ఈ మధ్యకాలంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. వాటిలో థైరాయిడ్ కూడా ఒకటి. ముఖ్యంగా థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు తీసుకుననే ఆహారంలో ఎన్నో రకాల జాగ్రత్తలను పాటించాలి. ముఖ్యంగా మహిళలు థైరాయిడ్ సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నారు. అయితే థైరాయిడ్ ను కంట్రోల్ చేసుకోవడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. థైరాయిడ్ సమస్యలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి హైపోథైరాయిడిజం మరొకటి హైపర్ థైరాయిడిజం. శరీరానికి సరిపడా థైరాయిడ్ హార్మోన్లను విడుదల చేయకపోవడం వలన హైపోథైరాయిడిజం సమస్య వస్తుంది మరియు అధికంగా ఉత్పత్తి చేసినప్పుడు హైపర్ థైరాయిడిజం సమస్య ఏర్పడుతుంది.

ఇటువంటి సమస్యలను ఎదుర్కొన్నప్పుడు గుడ్డులో ఉండే పచ్చ సొన, చేపలు, రొయ్యలు తప్పక తీసుకోవాలి. వీటితో పాటుగా పాలు, పెరుగు వంటి మొదలైన డైరీ పదార్థాలను తీసుకోవాలి. ముఖ్యంగా శాఖాహారులు అయితే తృణధాన్యాలు, వాల్నట్స్, చియా గింజలు, అవిస గింజలు, బ్రెజిల్ నట్స్, పాలకూర, క్యారెట్లు, చిలకడ దుంపలు, బీన్స్, బెర్రీస్, ఆపిల్స్, బ్రౌన్ రైస్ మరియు క్వినోవా వంటివి తీసుకోవాలి. ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వలన శరీరానికి అవసరమైనటువంటి ఫైబర్ అందుతుంది. దాంతో థైరాయిడ్ హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి.

అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వలన థైరాయిడ్ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. చాలా శాతం మంది పంచదారను ఎంతో ఇష్టంగా ఎక్కువ మోతాదు లో తీసుకుంటారు. ముఖ్యంగా కుకీలు, చాక్లెట్లు, పేస్ట్రీలు, పానీయాలు వంటివి అస్సలు తీసుకోకూడదు. అంతేకాకుండా డీప్ ఫ్రై చేసినటువంటి స్నాక్స్, చిప్స్ వంటివి పూర్తిగా తగ్గించాలి. వీటితో పాటుగా కెఫైన్ ను అస్సలు తీసుకోకూడదు. ఇటువంటి జాగ్రత్తలను మీ రోజువారీ ఆహారంలో తీసుకోవడం వలన థైరాయిడ్ సమస్య కంట్రోల్ లో ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news