తరచూ కాళ్లు తిమ్మిర్లు, దవడ నొప్పా.. అమ్మో కొలెస్ట్రాల్‌ పెరుగుతుందిగా..!

-

బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ అనేది చాపకిందనీరులా వ్యాపిస్తుంది. అది మొదలైనప్పుడు పెద్దగా తేడా తెలియదు. బ్రౌన్‌ ఫ్యాట్‌ కాస్తా వైట్‌ ఫ్యాట్‌ అయిన తర్వాత అప్పుడు కొన్ని కొన్ని లక్షణాలు బయటేస్తాయి. లావు అవుతున్నప్పడు జనాలు గుర్తిస్తారు. మనకు కూడా కాస్త ఆయసంగా ఉంటుంది. బట్టలు ఉన్నట్టుండి టైట్‌ అయిపోతాయి. వీటితో పాటు..ఊకూకే కాళ్లు తిమ్మిర్లు. అవును కొంతమందికి వెంటనే తిమ్మిర్లు వచ్చేస్తాయి. చూడ్డానికి సన్నగా ఉన్నా వారిలో ఈ సమస్య పదే పదే వస్తుంది అంటే..దాని అర్థం..బాడీలో ఫ్యాట్‌ పెరుగుతందనే.!

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం మంచి సంకేతం కాదు. ఇది శరీరంలో రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది. దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొలెస్ట్రాల్‌ గుండె పాలిట యమపాశం లాంటింది. అధిక కొలెస్ట్రాల్ గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.

తిమ్మిర్లు ఎందుకు వస్తాయి..

రక్త నాళాలలో కొలెస్ట్రాల్ పేరుకుపోయినప్పుడు, రక్త ప్రవాహానికి అడ్డంకిగా మారుతుంది. కాళ్లకు ఆక్సిజన్‌ను సరిగ్గా అందదు. ఫలితంగా.. కాలి కండరాలలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. అప్పుడే మనకు తిమ్మిరిగా అనిపిస్తుంది. ఇది కొలెస్ట్రాల్‌కు సంకేతం. చాలా సందర్భాలలో కొలెస్ట్రాల్ కాళ్ళ స్నాయువులను ప్రభావితం చేస్తుంది. కాళ్లలో అసాధ్యమైన నొప్పి కూడా వస్తుంది. ఈ రకమైన నొప్పి తొడలు లేదా మోకాళ్ల క్రింద, వెనుక భాగంలో ఎక్కువగా ఉంటుంది. నడిచేటప్పుడు నొప్పి మరింత ఎక్కువ అవుతుంది.

కొలెస్ట్రాల్ పెరిగి గుండెపై ఒత్తిడి పడుతుంది. ఫలితంగా పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి (PDA) వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. దీనివల్ల పరుగెత్తడం, నడవడం కూడా కష్టం అవుతుంది.

చాలా సార్లు దవడలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. దవడకు గుండెకు ఏంటి సంబంధం అనుకుంటారేమో..! ఆహారాన్ని నమలడం కూడా కష్టంగా మారుతుంది. గుండెకు రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడినప్పుడు, దవడలో సమస్య ఏర్పడుతుంది. దవడ నొప్పి ఛాతీ నొప్పికి కూడా దారితీస్తుంది.

చెడు కొలెస్ట్రాల్‌ అనేది గార్బేజ్‌ లాంటిది. ఇది బాడీలో ఎంత ఎక్కువ ఉంటే మన బాడీ అంత రోగాలమయం అవుతుంది. చెత్తను చీపురుతో క్లీన్ చేసినట్లు…ఈ బ్యాడ్‌ కొలెస్ట్రాల్‌ను ఫైబర్‌ కంటెంట్‌ ఫుడ్‌తో తరిమికొట్టాలి.!

Read more RELATED
Recommended to you

Exit mobile version