చక్కని జీవితానికి ఆటలే బెస్ట్..!

-

చాల మంది తల్లిదండ్రులు బయటకి పంపరు. అలాగని ఇంట్లో కూడా ఆటలని ఆడుకోనివ్వరు. నేటి తరం పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్లకే అలవాటు పడిపోయారు. అది మంచి అలవాటు కాదు.
అయితే చక్కగా ఆడుకుంటూ…సoదడిగా తిరిగితే ఆత్మవిశ్వాసం, ఉత్సాహం మెండుగా ఉంటాయి. చదువుల్లో, ఆటల్లో రాణించేందుకు ఎంతగానో దోహదపడుతుంది కూడా. ఈ విషయం మిచిగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. అలానే ఆదుకునే పిల్లల్లో సానుకూల దృక్పథం పెంపొందుతుంది అని చెప్పారు.

ఈ పరిశోధకులు న్యూజిలాండ్‌ లో నెలల పిల్లల నుంచి 45 ఏండ్ల పెద్దల వరకు దాదాపు వెయ్యి మందిపై పరిశోధనలు చేసి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఇలా చిన్నప్పటి నుంచీ ఆత్మవిశ్వాసం తో పెరిగినవాళ్లు జీవితంలో ఎదురయ్యే సవాళ్లనూ, సమస్యలనూ చక్కగా ఎదుర్కొంటారని అన్నారు. అలానే చదువుల్లో, ఆటల్లో రాణించడానికి తోడ్పడుతుంది. ఆరోగ్యంగా జీవించటానికి కూడా ఇవి ఉపయోగపడతాయి.

అలానే ఎక్కువగా ఆటపాటల్లో పాల్గొంటే పోటీతత్వం కూడా వాళ్ళల్లో అలవాటు అవుతుంది. పిల్లలకు వెసులుబాటు కల్పించాలి. అప్పుడే, సొంతంగా పనులు చేయగలమన్న ధీమా వారిలో పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడు వాళ్ళని ఆడుకోనివ్వాలి. ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు ఇన్ని లాభాలు ఉంటాయి ఆటలు ఆడుకోవటం వల్ల. కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళని ఆడుకునేలా చెయ్యాలి. స్మార్ట్ ఫోన్స్, వీడియో గేమ్స్ ని ఇవ్వకుండా పరిగెత్తి ఆనందంగా ఆడుకునేలా మార్చాలి. అప్పుడు వాళ్లకి మీరు మంచి జీవితాన్ని ఇచ్చిన వారవుతారు.

Read more RELATED
Recommended to you

Latest news