Masturbation : హస్తప్రయోగం తర్వాత టాయిలెట్‌కు వెళ్తున్నారుగా..?

-

ఈ జనరేషన్‌లో హస్తప్రయోగం చేసుకోవడం అనేది చాలా సాధారణమైన విషయం. ఇంతకు ముందు దీని గురించి మాట్లాడటానికి ఎవరూ ఇష్టపడే వాళ్లు కాదు. కానీ ఇప్పుడు ఫ్రెండ్స్‌ ఓపెన్‌గా డిస్కస్‌ చేసుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో కూడా సెక్స్‌ గురించి బోలెడంత అవర్నేస్‌ ఇచ్చే ఆర్టికల్స్‌ ఉంటున్నాయి. ఒక అలవాటు వ్యసనంగా మారితే.. అది నాశనానికే దారితీస్తుంది. ఇది కూడా అంతే.. హస్తప్రయోగం అనేది ఎప్పుడన్నా ఒకసారి అయితే ఒకే.. కానీ ఉద్యమం చేసినట్లు చేస్తే.. ఆఖరికి ఏం మిగలదు. ఒక పద్ధతి, ప్లానింగ్‌, విజన్‌, అన్నీ సెట్ చేసుకుని చేయాలి. ఎప్పుడంటే అప్పుడే ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా హస్తప్రయోగం చేస్తే..అస్సామే అవుతుంది. హస్తప్రయోగం చేసేటప్పుడు యుటీఐ ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంది. అందుకే పరిశుభ్రతపై శ్రద్ధ వహించాలి. దీన్ని నివారించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి.

సెక్స్ తర్వాత టాయిలెట్‌కి వెళ్లాలని చాలా మందికి తెలుసు. ఇది మూత్ర నాళంలోకి ప్రవేశించే బ్యాక్టీరియాను శుభ్రపరుస్తుంది. అయితే హస్తప్రయోగం తర్వాత మూత్ర విసర్జన గురించి చాలా మందికి తెలియదు. హస్తప్రయోగం తర్వాత టాయిలెట్‌కి వెళ్లి శుభ్రం చేసుకోవాలి. మీ అరచేతులు, వేళ్లు, సెక్స్ టాయ్‌లు, లోదుస్తుల ద్వారా జననేంద్రియాలతో సంబంధంలోకి వచ్చే బ్యాక్టీరియా UTI రిస్క్‌కి కారణమవుతుంది. కాబట్టి.. హస్తప్రయోగం చేసిన తర్వాత కూడా టాయిలెట్ వెళ్లాలి.

హస్తప్రయోగానికి ముందు, తర్వాత మీ చేతులను శుభ్రంగా కడుక్కోవడం అనేది చాలా ముఖ్యం. మురికి చేతులతో మీ ప్రైవేట్ పార్టస్‌ను తాకితే.. అవి ఇన్ఫెక్షన్‌కు గురవుతాయి. వ్యాధి సంక్రమణ అవకాశాలను పెంచుతాయి. బాక్టీరియా మీ చేతులు, గోళ్ళలో ఉండొచ్చు. దీని ద్వారా సమస్యలు రావొచ్చు.

లక్షలాది బ్యాక్టీరియా గోళ్లలో గూడు కట్టుకోని మరీ ఉంటుంది. మీరు యోని హస్తప్రయోగం చేస్తుంటే, గోర్లు జననేంద్రియాల్లోకి వెళ్తాయి. ఇది పరిశుభ్రతను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. లేనిపోని వ్యాధులు వచ్చే అవకాశం చాలా ఉంటుంది. అందుకే గోళ్లు చిన్నగా ఉండాలి. శుభ్రంగా చూసుకోవాలి. జననేంద్రియ ఇన్ఫెక్షన్లను నివారించడానికి మీరు క్రమం తప్పకుండా ఉతికిన, శుభ్రమైన లోదుస్తులను ధరించండి. ఇలా చేయడం ద్వారా మీరు మీ ప్రైవేట్ భాగాల pH స్థాయిని ఉన్నత స్థాయిలో ఉంటాయి. సెక్స్‌ టాయ్స్‌కు ఉపయోగించే వాళ్లు ఇంకా కేరింగ్‌గా ఉండాలి. వాటిని శుభ్రంగా ఉంచాలి. వాడేముందు, వాడేసిన తర్వాత క్లీన్‌ చేసి భద్రపరచాలి. ఇలా జాగ్రత్తలు తీసుకోని అప్పుడప్పుడు హస్తప్రయోగం చేస్తే ఎలాంటి రిస్క్‌ ఉండదు మరీ.!

Read more RELATED
Recommended to you

Latest news