చలికాలం అయిపోయింది.. ఎప్పటిలాగే ఎండాకాలం వచ్చేసింది. ఇంకా మార్చి నెల కూడా రాకముందే ఫిబ్రవరి నెలలోనే ఎండలు ముదిరిపోతున్నాయి. దీంతో వేడికి జనాలు తాళలేకపోతున్నారు. అయితే చలికాలం అన్ని రోజులు ఎవరైనా వేడి నీటితోనే స్నానం చేస్తారు. అదే వేసవి కాలం వస్తే చన్నీళ్ల స్నానం చేస్తారు. నిజానికి అసలు ఏ కాలంలో అయినా సరే.. మనకు చన్నీళ్ల స్నానమే మంచిది. ఈ క్రమంలోనే ఆయుర్వేద ప్రకారం.. నిత్యం చన్నీళ్లతో స్నానం చేస్తే మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..!
1. చన్నీళ్లతో స్నానం చేయడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మన శరీరంలో రక్తంలో ఉండే తెల్ల రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. అందువల్ల ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా ఉంటాయి.
2. మానసిక సమస్యలు, ఆందోళన, ఒత్తిడిలతో సతమతం అయ్యే వారు నిత్యం చన్నీళ్లతో స్నానం చేస్తే ఆయా సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. చక్కగా నిద్ర పడుతుంది.
3. చర్మ సంబంధ సమస్యలు ఉన్నవారు చన్నీళ్లతో స్నానం చేస్తే మంచిది. చర్మం కాంతివంతంగా కూడా మారుతుంది.
4. రోజూ చన్నీళ్లతో స్నానం చేస్తే అధిక బరువు తగ్గుతారు.
5. చిన్న పిల్లలకు నిత్యం చన్నీటితో స్నానం చేయిస్తే వారిలో పెరుగుదల సరిగ్గా ఉంటుంది.