టీడీపీకి కోలుకోలేని షాక్.. మాజీ ఎమ్మెల్యే మృతి…!

-

తెలుగుదేశం పార్టీ ఏలూరు మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి గుండె పోటు తో మరణించారు. 2009 లో తొలిసారి ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేసిన ఆయన అసలు పేరు బడేటి కోట రామారావు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మార్గ మధ్యలోనే ఆయన తుది శ్వాస విడిచారు. 2009 లో ప్రజారాజ్యం నుంచి ఓటమి పాలైన ఆయన…

2014 లో మాత్రం ఆళ్ళ నానీ (ప్రస్తుత మంత్రి) మీద పోటి చేసి… 24 వేల పై చిలుకు ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఏలూరు నియోజకవర్గంలో ఆయనకు బలమైన క్యాడర్ కూడా ఉంది. 2019 ఎన్నికల్లో 4000 ఓట్ల తేడాతో ఆయన ఆళ్ళ నానీ చేతిలోనే ఓటమి పాలయ్యారు. ఎస్వీ రంగారావు మేనల్లుడు అయిన బుజ్జి చిన్న వయసులోనే మరణించడంతో తెలుగుదేశం పార్టీలో విషాద చాయలు అలముకున్నాయి. దాదాపు మూడు దశాబ్దాలుగా ఆయన తెలుగుదేశం పార్టీలో కొనసాగారు.

Read more RELATED
Recommended to you

Latest news