ఇవి తింటే మందు తాగినా మంచిదేనా…!

-

మ‌ద్య‌పానం ఆరోగ్యానికి హానికరం… అయితే దీనికి కొన్ని స‌వ‌ర‌ణ‌లు చేస్తూ మ‌ద్యం కూడా ఆరోగ్యానికి మేలే చేస్తుంద‌ని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.. అయితే మ‌ళ్లీ  మితంగా సేవిస్తేనే అంటూ నిబంధ‌న‌ను గుర్తు చేస్తున్నారు.  మిత భోజ‌నం ఆరోగ్యానికి దోహ‌దం చేస్తుంద‌ని డాక్ట‌ర్లు చెబుతుంటారు. ఇప్పుడు మందు విష‌యంలోనూ అదే సూత్రం వ‌ర్తిస్తుందంట‌.మద్యం సేవిస్తే.. నష్టాలు కంటే.. లాభాలే ఎక్కువ ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు.  వాస్త‌వానికి మ‌ద్యం ప్రియులు రోజూవారీగా పుచ్చుకోవ‌డం ప‌రిపాటిగా మారింది. ఎంత తాగుతున్నారో..ఏం సంద‌ర్భం అనుకుని తాగుతున్నారో..ఎప్పుడు ప‌డితే అప్పుడు..ఎక్క‌డ‌ప‌డితే అప్పుడు తాగేస్తున్న‌ట్లు ప‌లు స‌ర్వేల్లో వెల్ల‌డైంది.

రోజుకి లెక్కలేసుకుని మందు తాగే రోజులు పోయాయి. ఇప్పుడు మందుబాబులు సందు దొరికితే చాలు.. మద్యం షాపుల్లో బాటిళ్లకు బాటిళ్లు తాగేస్తుంటారు. గ‌డిచిన ద‌శాబ్ధ‌కాలంలో దేశ‌వ్యాప్తంగా 40శాతం పైగా మ‌ద్యం అమ్మ‌కాలు పెరిగిపోవ‌డం విశేషం. ఇక అస‌లు విష‌యానికి వ‌ద్దాం.. మితంగా మందుతాగేవాళ్లు కొన్ని జాగ్ర‌త్త‌లు..ఆహార‌పు అల‌వాట్ల‌లో మార్పులు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటార‌ని నిపుణులు చెబుతున్నారు. రోజుకు ఒక పెగ్ మాత్ర‌మే మందు పుచ్చుకునే వాళ్ళు ఎక్కువగా టీకి బ‌దులుగా గ్రీన్ టీ తాగ‌డం ఎంతో మంచి చెబుతున్నారు.

గ్రీన్ టీలో తన్నిన్స్, కటేచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల.. అవి లివర్‌ను ఆరోగ్యకరంగా ఉంచుతాయ‌ని చెబుతున్నారు. అలాగే లివర్‌లో ఉండే  ఫైబ్రోసిస్, సిర్రోసిస్, హేపతెతిస్ లాంటి విష పదార్థాల‌ను ఈ యాంటీ యాక్సిడెంట్లు నాశనం చేస్తాయి. మ‌ద్యం ఎక్కువ తాగేవాళ్ల‌లో  జీర్ణాశయంలో మంట పుడుతుంది. ఇది రాకుండా ఉండాలంటే  ఆపిల్‌ను రోజూ తీసుకుంటే మంచి చేస్తుందంట‌. ఆపిల్‌లో ఉండే పెక్టిన్ అనే కెమికల్ మంట నుంచి ఉపశమనం కలిగిస్తుదంట‌. అల్లాన్ని ద్రవం రూపంలో తీసుకోవడం వల్ల అందులో ఉండే అల్లిసిన్, సెలేనియం లివర్‌ను సురక్షితంగా ఉంచుతాయ‌ట.

మ‌ద్యం అల‌వాటున్న వారు సిట్రస్ జాతి ఫలాలను రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకుంటే.. అవి లివర్‌లో పేరుకుపోయిన వ్యర్ధ పదార్ధాలను నాశనం చేయడంలో సహాయపడతాయి. క్యారెట్స్, టమాట, పాలకూర, బీట్ రూట్ లాంటివి తీసుకుంటే డీటాక్సిఫికేషన్‌కు ఎంతగానో ఉపయోగపడతాయ‌ట‌. మ‌రి మందుబాబులు తాగిన ఫ‌ర్వాలేదు గాని ఈ ఫుడ్‌ను తీసుకుంటే కొంచెం ప్ర‌మాదాన్ని త‌గ్గించుకున్న వార‌వుతార‌ని నిపుణులు గుర్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news