సీఎం జ‌గ‌న్ తొలి సంత‌కం చేసినా.. అమ‌లు కాని హామీ..

-

2019లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి తొలిసారి ముఖ్యమంత్రి అధికారం చేపట్టారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడైన జగన్ తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ తన పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డారు. ఈ ఏడాది మే 30న విజయవాడలో జగన్‌మోహన్‌రెడ్డి తన ప్రమాణస్వీకారోత్సవం తర్వాత చేసిన తొలి సంతకమే ఇంతవరకు అమలు కాలేదు.

తాము అధికారంలోకి వస్తే పెన్షన్ లబ్ధిదారుల వయస్సును 65 ఏళ్ల నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ‘వైఎస్ఆర్ పెన్షన్ కానుక’ ఫైల్ మీద సంతకం కూడా చేశారు. అయితే, ఇంత వరకు ఆ విషయంలో అడుగు మాత్రం ముందుకు పడలేదు. గతంలో లబ్ధిదారులను ఎంపిక చేసిన తర్వాత నుంచి నేటి వరకు మధ్యలో 60 సంవత్సరాలు దాటిన ఎవరికీ పెన్షన్లు రావడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news