Sauna Bath : ఒలంపిక్స్ లో పాల్గొన్న వినేష్ ఫోగట్, అమన్ సెహ్రావత్ వంటి వాళ్ళు సౌనాస్ బాత్ అనే పద్ధతిని ఫాలో అయ్యారు. దీని వలన కొన్ని కిలోల బరువుని సులభంగా తగ్గిపోవచ్చని చాలామంది అంటున్నారు. ఇది నిజమేనా..? నిజంగా సౌనాస్ బాత్ ద్వారా కొన్ని కిలోలను వేగంగా తగ్గిపోవచ్చా..? అమన్ 61.5 కేజీల బరువు ఉన్నారు.4.5 కిలో గ్రాములు తగ్గిపోవాలి. అది కూడా 10 గంటల్లోనే. అప్పుడే 57 కేజీల సెమీఫైనల్ కి చేరుకోగలరు. ఒక గంట పాటు వేడి నీటి సెషన్ లో చేరి ఆయన బరువు తగ్గాలని చూశారు. సౌనాస్ బాత్ కి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సౌనాస్ బాత్ (Sauna Bath) అంటే అసలు ఏమిటి..?
ఇది ఆవిరి స్నానం. ఎక్కువగా చెమట పడుతుంది. వేడి రాళ్లు లేదా విద్యుత్ పొయ్యిల ద్వారా ఉత్పత్తి చేయబడిన పొయ్యి వేడిని ఉపయోగించుకునే వేడి గది. ఆవిరి బాయిలర్ల ద్వారా ఉత్పత్తి చేయబడిన తడి లేదా తేమ వేడిని ఉపయోగించే వేడి గది. ఆవిరి స్నానం లో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. భారీ టీషర్టు వదులుగా ఉండే కాటన్ టవల్, షార్ట్ ఎప్పుడు ఆవిరి స్నానానికి బెస్ట్. వీటిని ధరించి ఆవిరి స్నానం చేస్తారు. ఆవిరి స్నానం లోకి ప్రవేశించే ముందు శుభ్రమైన దుస్తులు ధరించాలి. సింథటిక్ దుస్తులు టైట్ గా ఉండే దుస్తులు వేసుకుని చేయకూడదు.
అసలు ఉపయోగం ఉందా..?
- రిలాక్సేషన్ కోసం చాలామంది ఈ పద్ధతిని ఫాలో అవుతారు. సులువుగా వాటర్ లాస్ అయిపోవచ్చు.
- అయితే ఇది కేవలం టెంపరరీ పద్ధతి మాత్రమే. ఒకవేళ మీరు ఈ పద్ధతి ద్వారా బరువు తగ్గితే, త్వరగా మీరు మళ్ళీ బరువు పెరిగిపోతారు.
- బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి, కండరాల అలసటని తగ్గించడానికి ఈ పద్ధతి బాగా హెల్ప్ అవుతుంది.
- ఒత్తిడిని కూడా దూరం చేసుకోవచ్చు అని ఆరోగ్య నిపుణులు తెలిపారు.
అయితే ఇది కొవ్వును కరిగించే పద్ధతి కాదని మీరు గమనించాలి. చాలా మంది నిపుణులు ఈ పద్ధతి ద్వారా బరువు తగ్గడానికి అవ్వదు కానీ టెంపరరీ గా నీటిని కోల్పోయే అవకాశం ఉంటుందని అన్నారు. మరీ ఎక్కువగా చెమటను కోల్పోవడం వలన డిహైడ్రేషన్ సమస్య రావొచ్చు.