డ్రాగన్ ఫ్రూట్ చూసేందుకు పింక్ రంగులో ఉంటుంది. దీన్ని హిందీలో పిటాయా అని పిలుస్తారు. ఇది డ్రాగన్‌ను పోలి ఉంటుంది కాబట్టి దానికా పేరు వచ్చింది. ఇది ఎక్కువగా ఆసియాలోని కొన్ని ప్రాంతాలు, అమెరికా, ఆస్ట్రేలియాలో పండుతుంది. ఇక రుచి విషయానికి వస్తే కివీ, పైనాపిల్‌లను పోలి ఉంటుంది. మరి డ్రాగన్ ఫ్రూట్ గురించి ఎంతమందికి తెలుసు..? ఈ మద్య ఈ పండు మార్కెట్‌లో కనిపిస్తుంది. అసలు డ్రాగన్ ఫ్రూట్ వల్ల లాభాలేంటో చాలామందికి తెలియదు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
డ్రాగన్ ఫ్రూట్ లాభాలు :
1. డ్రాగన్ పండు తినడం వల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. వీటిలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
2. డ్రాగన్ ఫ్రూట్‌లో ఫైబర్ పుష్కలంగా దొరుకుతుంది. ఇది జీర్ణ సమస్యలను పోగొడుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం తగ్గుతాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.
3. డ్రాగన్ ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి.
4. రక్త సరఫరా మెరుగుపడుతుంది. బీపీ కంట్రోల్ అవుతుంది. పొటాషియం ఎక్కువగా ఉన్నందున హార్ట్ సమస్యలు రావు. హార్ట్ ఎటాక్‌లు, స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి.
5. డ్రాగన్ ఫ్రూట్ వల్ల చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. దీంతో వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా రావు.
6. దీనిలో విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధక వ్యవస్థను మెరుగు పరుస్తుంది. దంతాలు , చిగుళ్ల సమస్యలు పోతాయి. శ్వాసకోశ సమస్యలు నుంచి ఉపశమనం లభిస్తుంది.