Makhana : మఖానాతో అందం ఆరోగ్యం.. ఈజీగా బరువు తగ్గచ్చు..!

-

ఎక్కువగా బరువు ఉండే వాళ్ళు బరువు తగ్గాలని weight lossఅనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు కూడా బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారా..?, కానీ ఫలించడం లేదా..? అయితే తప్పకుండా ఈ చిట్కాలను పాటించండి. ఈ విధంగా కనుక మీరు అనుసరిస్తే తప్పకుండా బరువు తగ్గడానికి వీలవుతుంది. మరి ఆలస్యమెందుకు దాని కోసం మనం ఇప్పుడు చూద్దాం.

Makhana for weight loss

 

ఈ రోజుల్లో చాలా మంది ఆరోగ్యంగా ఫిట్ గా ఉండాలనుకుంటున్నారు. అందుకోసం బరువు తగ్గాలని డైట్ ప్లాన్స్ ని అనుసరించడం.. జిమ్ కి వెళ్లడం, యోగా వంటివి చేయడం జరుగుతోంది. అయితే బరువు ఎక్కువగా పెరిగిపోవడానికి గల కారణమేమిటంటే..? ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకోవడం. జంక్ ఫుడ్ వల్ల విపరీతంగా బరువు పెరిగిపోవడం జరుగుతుంది. దీనితో ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది.

70 శాతం మంది ఒబిసిటీ బారిన పడుతున్నారని దీనికి గల కారణం సరైన ఆహార అలవాట్లు లేకపోవడం అని నిపుణులు గుర్తించారు. బరువు తగ్గడానికి, ఆరోగ్యంగా ఉండటానికి తీసుకునే కేలరీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే ముఖాన తీసుకోవడం వల్ల బరువు తగ్గచ్చని ఆరోగ్యం బాగుంటుందని అంటున్నారు నిపుణులు. ముఖాన లో ఉండే ప్రోటీన్ బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది. అదే విధంగా ముఖాన లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. కనుక మఖానా తీసుకోవడం వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. దీనితో అధికంగా ఆహారం తీసుకోకుండా ఉండడానికి కుదురుతుంది.

మఖానా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు:

  • మఖానాలో ప్రొటీన్లు, ఫైబర్ తో పాటు కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ సమృద్ధిగా ఉంటుంది. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయి.
  • అలానే మఖానాలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇది నర్వ్ ఫంక్షన్ ని బాగా ఉంచుతుంది.
  • మఖానాలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇది గుండె సంబంధిత సమస్యలు రాకుండా చూసుకుంటుంది.
  • అదే విధంగా క్యాన్సర్, డయాబెటిస్ సమస్యలు రావు. బ్లడ్ షుగర్ లెవల్స్ ని కంట్రోల్లో ఉంచుకోవడం కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.
  • చర్మం అందంగా ఉండడానికి పింపుల్స్, ముడతలు వంటివి రాకుండా చూసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది ఇలా ఎన్నో బెనిఫిట్స్ మనం పొందొచ్చు.

బరువు తగ్గడానికి మఖానా

బరువు తగ్గడానికి మ‌ఖానా ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది.

  • USDA ప్రకారం, ఒక కప్పు లేదా 32 గ్రాముల మఖానాలలో 106 కేలరీలు ఉంటాయి. వీటిలో కేలరీలు తక్కువగా ఉన్నందున స్నాక్స్‌గా తిన‌డం ఉత్త‌మం.
  • మఖానాలు తిన‌డం వ‌ల్ల పొట్ట నిండుగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. మ‌ఖానాల్లో ఉంటే ప్రోటీన్ దీనివ‌ల్ల ఆక‌లి త‌క్కువ‌గా అనిపిస్తుంది.
  • మ‌ఖ‌నాల్లో సాచురేటెడ్ కొవ్వు ఉండ‌టం వ‌ల్ల అవి శరీరానికి చాలా ఆరోగ్యకరమైనవి.
  • తక్కువ గ్లైసెమిక్ ఆహారాలు ఉండటం వలన, మఖానాలు మీ రక్తంలో చక్కెర స్థాయిలను స‌మ‌తుల్యంగా ఉండ‌టంలో తోడ్ప‌డ‌తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version