ఇన్ఫినిటీ వాకింగ్‌ వల్ల వేగంగా బరువు తగ్గొచ్చు తెలుసా..?

-

నడక వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని అందరికీ తెలుసు. అయితే నడక కూడా కరెక్టుగా సరైన పద్ధతిలో చేయడం వల్లనే ఆ ప్రయోజనాలను పొందవచ్చు.. ఇదో జాలీగా వాకింగ్‌ చేస్తే.. టైమ్‌ పాస్‌ తప్ప ఏం లాభం ఉండదు.. 8 ఆకారపు నడక వల్ల మీరు రెట్టింపు ప్రయోజనాలను పొందవ్చు. దీనిని ఇన్ఫినిటీ వాక్ అని కూడా అంటారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇన్ఫినిటీ వాక్ – బరువు తగ్గడం

ఈ సంఖ్య 8 ఆకారంలో ఉండటం వల్ల వేగంగా బరువు తగ్గే అవకాశం ఉంది. ఈ ఆకృతిలో నడవడం వల్ల శరీర భాగాలు, కండరాలన్నీ కదులుతాయి. కొవ్వు సులభంగా కరిగిపోతుంది. కాబట్టి తక్కువ సమయంలో వేగంగా బరువు తగ్గే అవకాశం ఉంది.

8 ఆకార నడక – BP నియంత్రణ

అధిక రక్తపోటు ఉన్నవారు ఈ ఆకారంలో నడవడం ద్వారా రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చని ఓ అధ్యయనం చెబుతోంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ ఆకృతిలో నడవడం వల్ల గుండెపై భారం తగ్గుతుంది. ఒత్తిడి కూడా తగ్గుతుంది. కాబట్టి బీపీ కూడా అదుపులో ఉంటుంది.

కండరాలు ఎక్కువగా కదులుతాయి

8 ఆకారంలో నడవడం వల్ల కండరాలు ఎక్కువగా పనిచేస్తాయి. వెనుకకు, ముందుకు వంగడం వల్ల పొట్ట దగ్గర కండరాలు, తొడల కండరాలు బలపడతాయి. ఎలాంటి దెబ్బలైనా తట్టుకోగలవు. ఫిట్‌నెస్‌ను పెంచుతుంది. కొవ్వు కరుగుతుంది.

శరీర సమతుల్యతను మెరుగుపరుస్తుంది

ఫిగర్ ఎనిమిది ఆకారంలో నడవడం ఒక వ్యక్తి యొక్క ఆనందాన్ని పెంచుతుంది. అంతే కాకుండా టర్న్ తీసుకునేటప్పుడు బాడీ బ్యాలెన్స్ తప్పి కిందపడే అవకాశం ఉంది. కాబట్టి ఇలా చేయడం వల్ల శరీర సమన్వయం పెరుగుతుంది. ఒత్తిడి, ఆందోళన కూడా తగ్గుతాయి.

మీరు ఎలాగూ రోజు వాకింగ్ చేస్తుంటే.. కొన్ని రోజులు ఇలా నడిచి చూడండి.. ఏమో ఏమైనా ప్రయోజనం ఉండొచ్చు కదా.! ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునేవాళ్లు ట్రై చేయండి.. మనకు ఎలా నడిచినా వెయిట్‌ లాస్‌ అవ్వడం ముఖ్యం కాబట్టి ఆ లక్ష్యాన్ని చేధించడానికి కొత్త కొత్త ప్రయత్నాలు చేయడంలో తప్పు లేదు..!

Read more RELATED
Recommended to you

Latest news