నేడు ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ

-

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. ఇందుకోసం ఆయన బుధవారం సాయంత్రమే దిల్లీ చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల చివరి వారంలో పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న తరుణంలో రాష్ట్ర అవసరాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ మేరకు తగిన సాయం కోరే ఉద్దేశంతో మోదీతో భేటీ కానున్నారు. ఆయనతోపాటు రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్, రహదారులు భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ప్రసాద్‌ ఇతర అధికారులు ముఖ్యమంత్రి వెంట దిల్లీ వచ్చారు.

ఈ పర్యటనలో గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం కారణంగా ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రధానమంత్రి, ఇతర కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆర్థికంగా, మౌలిక వసతుల పరంగా సాయం కోరనున్నట్లు సమాచారం. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌వే, రహదారుల మరమ్మతులు, పట్టణ, గ్రామీణ పేదల ఇళ్లు, జల్‌జీవన్‌ మిషన్‌ కింద ఇంటింటికీ తాగునీరు తదితర అంశాలపై చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తులు చేయనున్నట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news