Health care: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా వారి ఆరోగ్యం పై ఎంతో దృష్టి సాధించారు. కరోనా తర్వాత చాలామంది ఆరోగ్యం పై శ్రద్ధ వహిస్తూ ఎన్నో రకాల జాగ్రత్తలను తీసుకుంటూ ఉన్నారు. ఇక మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాయామం అనేది చాలా అవసరం అనే సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో సరైన సమయానికి వ్యాయామం చేయడానికి కూడా సమయం లేకుండా పోతుంది.
ఇలా వ్యాయామం చేయటం ఆరోగ్యానికి ఎంతో మంచిదని భావించి వారికి సమయం దొరికినప్పుడు వ్యాయామం చేస్తుంటారు అయితే ఇలా మనకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు వ్యాయామం చేయటం మంచిదేనా వ్యాయామం చేయటానికి కూడా ఒక సరైన సమయం ఉంటుందా అనే విషయానికి వస్తే… ఎవరైతే శరీర బరువు తగ్గాలని వ్యాయామం చేస్తారో అలాంటివారు ఉదయం పరగడుపున వ్యాయామం చేయటం ఎంతో మంచిది. ఇలా ఉదయమే చేయటం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గడమే కాకుండా జీవక్రియ రేటు కూడా మెరుగుపడుతుందని జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజంలో ప్రచురించబడిన కథనం ద్వారా తెలిపారు.
ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు వ్యాయామం చేయటం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఆరోజు మొత్తం చాలా చురుగ్గా ఉండడానికి ఈ వ్యాయామం ఎంతగానో దోహదపడుతుంది. మరి సాయంత్రం సమయంలో వ్యాయామం చేయడం మంచిదేనా అనే విషయానికి వస్తే.. సాయంత్రం వ్యాయామం చేసేవారు కడుపు ఖాళీగా ఉండేలా చూసుకోవాలి అయితే ఉదయం వ్యాయామం చేస్తే మేలా సాయంత్రం చేస్తే మేలా అనే విషయానికి వస్తే సాయంత్రంతో పోలిస్తే ఉదయమే వ్యాయమం చేయటం వల్ల అధిక ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.