కొలస్ట్రాల్‌ గురించి అవి ముందే అలర్ట్‌ చేస్తాయి!

-

కొలెస్ట్రాల్‌ ప్రాణాంతకం కాకున్నా అది శరీరానికి మంచిది కాదు. కాలేయం ఉత్పత్తి చేసే కొలస్ట్రాల్‌ వల్ల కొన్ని పనులు చేస్తాయి. ఇది కణాల పటాలం ఏర్పాటుకు, కొన్ని హర్మోన్ల ఉత్పత్తికి, విటమిన్‌ డీ పనీతీరుకు సాయపడుతుంది. బ్యాడ్‌ కొలñ స్ట్రాల్‌ రక్తం ద్వారా ప్రవహిస్తుంది. దీన్ని హై కొలేస్ట్రాల్‌ అంటారు. హై కొలెస్ట్రాల్‌ ప్రాణాంతకం. అయితే దీన్ని ముందుగానే మన శరీర అవయవాలు అలర్ట్‌ చేస్తాయి. మన చర్మం, కళ్లు, చేతులు ముందుగా మనకు జాగ్రత్త పడటానికి సాయపడతాయి. అది ఎలాగో తెలుసుకుందాం.


చేతుల నొప్పి

ధమనుల లోపలి భాగంలో ఫ్యాట్‌ పేరుకున్నప్పుడు రక్త ప్రసరణకు ఇబ్బంది ఏర్పడుతుంది. రక్తం గడ్డకడుతుంది.దీన్నే ఎథేర్సోక్లోరోసిస్‌ అంటారు.

చర్మం

కొలెస్ట్రాల్‌ లెవల్‌ పెరిగినపుడు చర్మంపై పసుపు లేదా నారింజ రంగులోకి మారుతుంది. ఆ భాగంలో కొలెస్ట్రాల్‌ పేరుకుపోతుంది. కొంతమందికి వళ్ల ద్వారా తెలుసుకోవచ్చు. కాళ్ల కింద భాగంలో, అరచేతిలో కూడా నొప్పి లేని స్కిన్‌ డెవలప్‌ అవుతుంది.

కళ్లు నీలం రంగులోకి..

కొలెస్ట్రాల్‌ పెరిగిన కొంతమందిలో కళ్లలోని కార్నియా చుట్టూ బ్లూ లేదా గ్రే కలర్‌లో సర్కిల్‌ ఏర్పడుతుంది. అది స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని అర్కస్‌ సెనిలిస్‌ అంటారు. ఇది చిన్న వయస్సు వారిలో ఏర్పడితే హైపర్‌లైపిడెమియా అంటారు. దీన్ని వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news