దాల్చిన చెక్కతో అద్భుతం!

దాల్చిన చెక్కతో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ఈ విషయం చాలా మందికి తెలియదు. సాధారణంగా చాలా మంది దాల్చిని చెక్క పొడిని తమ పొలాల్లో కూడా చల్లుతారు. అయితే, అలా చల్లడం వల్ల ఏమవుతుంది? మీకు తెలుసా? మనం వాడే సుగంధ ద్రవ్యాల్లో దాల్చిన చెక్క ఒకటి. వంటల్లో దీన్ని వాడితే సువాసన వస్తుంది. ఇది శరీర మెటబాలిజంను పెంచుతుంది. దీన్లో యాంటీ–ఆక్సిడెంట్స్‌ ఎక్కువ కాబట్టి… శరీరంలో విష వ్యర్థాలను బయటకు పంపేస్తుంది. ఇదంతా ఒక వైపు. దీన్ని పొలంలో చల్లడం మరో కోణం.

మీ పొలంలో లేదా గార్డెన్‌ లో చీమలు ఉంటే పండే ఆహారాన్ని అవే తినేస్తాయి. అటువంటప్పుడు దాల్చిన చెక్క పొడిని చల్లితే చీమలు ఇట్టే పారిపోతాయి. ఈ పొడి వల్ల చీమలకు ఊపిరి ఆడదు. అందుకే అవి పారిపోతాయి. దీనిలో యాంటీ–ఫంగల్‌ గుణాలున్నాయి. అందువల్ల సినమన్‌ను కాస్మెటిక్స్‌ తయారీలో వాడుతారు. పొలంలో పెరిగే ఫంగస్, విషపూరిత పుట్టగొడుగులను చంపేస్తుంది. పుట్టగొడుగులు ఉన్నచోట ఈ పొడిని చల్లితే అవి అనిపించవు.

మీరు ఇళ్లలో మొక్కల్ని పెంచుతారు. వాటికి పురుగులు పడి చనిపోతే బాధగా ఉంటుంది. అప్పుడు దాల్చిన చెక్క పొడి చల్లాలి. దీని వల్ల మొక్కలు బాగా పెరుగుతాయి. దాల్చిన చెక్క వల్ల దోమలను దూరంగా పారిపోతాయి. దీని వాసన దోమలకు నచ్చదు. ఈ పొడి చల్లడం వల్ల ఒక్క దోమ కూడా మొక్కల జోలికి రాదు.

మీరు నమ్మలేరు గానీ, దాల్చిన చెక్క పొడి దెబ్బతిన్న మొక్కల్ని బాగుచేస్తుంది. ఏ మొక్కలైన పూలు సరిగా పూయకుంటే, దాల్చిన చెక్క పొడి చల్లాలి. అలాగే ఆకుల పైన కూడా. అప్పుడు అవి చక్కగా కోలుకుంటాయి. అలాగే రోజా మొక్కను బయటి నుంచి తెచ్చి నేలలో లేదా కుండీలో పాతుతున్నప్పుడు, ముందుగా ఆ మొక్కను దాల్చిన చెక్క పొడిని కలిపిన నీటిలో ముంచి తియ్యాలి. లేదా పొడిలోనైనా ముంచి తియ్యాలి. ఆ తర్వాత ఆ మొక్క బాగా పెరుగుతుంది. ఇలా పాడైన మొక్కలకు కూడా తిరిగి నిలిపే అద్భుతం దాల్చిన చెక్కలో ఉంటుంది.