పిల్లలకి ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వాలంటే ఇలా చెయ్యండి..!

-

పిల్లల ఆరోగ్యం పట్ల తప్పకుండా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి. మంచి పోషకాహారం, కూరగాయలు, పండ్లు వంటివి పిల్లలకు ఎక్కువగా పెడుతూ ఉండాలి. తాజాగా చేసిన రీసెర్చ్ ప్రకారం రీసెర్చర్లు పిల్లలకి ఏ విధంగా ఆహారం పెడితే తీసుకుంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పారు.

అయితే ఎక్కువ సేపు పిల్లల్ని కూర్చోపెట్టి ఆహారం పెట్టడం వల్ల ఎక్కువ ఆహారం తీసుకోవడానికి వీలవుతుందని.. దీని వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుందని రీసెర్చ్ ద్వారా తేలింది. ఎక్కువసేపు తినడం వల్ల ఎక్కువ తినడానికి వీలవుతుంది.

పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం తీసుకునేటప్పుడు ఈ చిట్కాలు పాటించండి:

పిల్లలు ఆహారం తినేటప్పుడు మీరు కూడా వాళ్ళ పక్కన కూర్చుని ఆహారం తినండి. దీని వల్ల వాళ్ళు ఆనందంగా ఆహారాన్ని తింటారు.
అదే విధంగా మంచి క్రియేటివ్ గా మీరు కూరగాయలు కట్ చేయండి. పిల్లల పట్ల కోపంగా ఉండొద్దు.
వాళ్లతో ప్రేమగా కూర్చుని మీరు ఆహారం పెట్టండి. బలవంతంగా పెట్టడం, ఇబ్బంది పెట్టడం వల్ల పిల్లలు ఆహారం తీసుకోలేరు.
అలానే ఉదయం అల్పాహారం కూడా చాలా ముఖ్యము. ఖచ్చితంగా మంచి అల్పాహారం మీ పిల్లలకు ఇవ్వండి. దీనితో వాళ్ళకి మంచి ఎనర్జీ వస్తుంది అదే విధంగా పోషకాలు అందుతాయి. ఇలా ఈ విధంగా మీరు కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పిల్లలు ఆహారం ఎక్కువగా తీసుకోవడంకి వీలవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news