వైరల్ వీడియో: భోజనం తినేటప్పుడు పూజించమని కుక్కలకి నేర్పుతున్న మహిళ..!

నిజంగా ఇళ్లల్లో కుక్కలని పెంచుకోవడం బాగుంటుంది. కుక్కల్ని సొంత పిల్లల్లాగా ఎంతో మంది ట్రీట్ చేస్తారు. వాటికి కూడా పిల్లలు లాగ మంచి విలువలు నేర్పిస్తారు. ఈ తరహా లోనే ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈమె తన పెంపుడు కుక్కలకి ప్రార్థన చేయమని నేర్పిస్తోంది.

భోజనం తినే ముందు దేవుడికి నమస్కారం చేయాలని ఆమె వాటికి నేర్పడం ఈ వీడియో లో మనం చూడొచ్చు. ఈ వీడియో సోషల్ మీడియా లో నలుమూలల షికార్లు కొడుతోంది. ఎప్పుడైనా తినేటప్పుడు దండం పెట్టుకొని తినమని మన పెద్దలు చెబుతూ ఉంటారు.

కానీ ఈమె ఈ విషయాలను కుక్కలకి చెప్పడం కాస్త భిన్నంగా ఉంది. ఆమె కింద కూర్చుని ఇరు వైపులా రెండు కుక్కల్ని పెట్టుకుంది. ఎదురుగా ఆహారం పెట్టి ప్రార్థన చేస్తోంది. ఆ పెట్స్ నిజంగా మంచి పిల్లల్లాగ ప్రవర్తిస్తున్నాయి.

ఒకసారి ఆమె తినమని చెబుతున్నప్పుడు వెంటనే ఆ రెండు పెట్స్ ఆహారం మీదికి దూకాయి ఇప్పటికే ఈ వీడియోని 24 వేల మంది చూశారు. నిజంగా సోషల్ మీడియా లో ఈ వీడియో తెగ వైరల్ అయి పోతోంది. ఈ వీడియోని వెయ్యి మందికి పైగా లైక్ చేసారు. ఈ వీడియో ని కనుక మీరు చూస్తే తప్పక షాక్ అవుతారు.