సెల్యులైట్ ను తగ్గించుకునేందుకు పనికొచ్చే ఇంటిచిట్కాలు..

-

చర్మం మీద ముఖ్యంగా పిరుదుల వద్ద, తొడ భాగంలో ఉబ్బుగా ఏర్పడి, చాలా వేగంగా విస్తరిస్తూ, విస్తరించిన భాగాల్లో గడ్డకట్టినట్లుగా అయ్యే లక్షణాలు కల ఇబ్బందిని సెల్యులైట్ ( Cellulite ) అంటారు. ఊబకాయంతో ఇబ్బంది పడే యువత, వృద్ధుల్లో ఈ ఇబ్బంది అప్పుడప్పుడు కనిపిస్తుంటుంది. అనవసర కొవ్వు కణాలు పెరిగిపోవడం వల్ల ఏర్పడే ఈ సెల్యులైట్ ని నుండి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది.

 

cellulite | సెల్యులైట్

ఐతే అల్లోపతిలో దీనిపై ఎన్నో వైద్యాలు ఉన్నాయి. కాకపోతే ఆ ఇబ్బంది మరీ తీవ్రంగా లేనపుడు ఇంట్లో పాటించే కొన్ని చిట్కాలతో సెల్యులైట్ ని తగ్గించుకోవచ్చు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మసాజ్

కొవ్వు కణాలని తొలగించడంలో మసాజ్ బాగా పనిచేస్తుంది. సెల్యులైట్ ఏర్పడిన భాగంలోని విష పదార్థాలు బయటకి పోవాలంటే మసాజ్ చేయాలి. మీకు మీరుగా అయినా లేదా ఇతరుల ద్వారా అయినా చేయించుకోవచ్చు. కొన్ని ముఖ్యమైన ఆయిల్స్ ఈ మసాజ్ కి వాడుకోవచ్చు కూడా.

బ్రషింగ్

పొడిగా ఉన్న బ్రష్ తో చర్మం మీద రుద్దడం వల్ల సెల్యులైట్ ని తగ్గించుకోవచ్చు. దీనివల్ల అనవసర పదార్థాలు బయటకి వెళ్ళిపోతాయి. పొడి బ్రష్ తీసుకుని పాదాల నుండి భుజాల వరకు మెల్లగా బ్రష్ చేయాలి. రోజుకి రెండుసార్లు 5నిమిషాల పాటు చేస్తే సరిపోతుంది.

కాఫీ స్క్రబ్

కాఫీ స్క్రబ్ వల్ల పేరుకుపోయిన కొవ్వు కణాలు బయటకి పోతాయి. సెల్యులైట్ ఏర్పడిన ప్రదేశంలో కాఫీ పౌడర్ తో పాటు రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె కలిపి స్క్రబ్ చేయాలి.

నీళ్ళు

కావాల్సినన్ని నీళ్ళు తాగడం వల్ల శరీరంలో ఏర్పడ్డ ఉబ్బిన కణాలు మాయం అవుతాయి. ఆ విష పదార్థాలు బయటకి పోవాలంటే కావాల్సినన్ని నీళ్ళు తాగడం మంచిది.

మాయిశ్చరైజ్

ప్రతీరోజూ మీ చర్మాన్ని తేమగా ఉంచుకోండి. తేమగా ఉన్న చర్మానికి ఎలాంటి సమస్యలు రావు. అదీగాక వదులుగా ఉన్న మీ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడంతో బిగుతుగా మారుతుంది. కాబట్టి సెల్యులైట్ ఏర్పడే అవకాశం ఉండదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version