సహజంగా ప్రతి నెల మహిళలు అందరూ నెలసరి ని ఎదుర్కొంటారు. పైగా దీంతో పాటుగా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే నెలసరి సమయంలో ఎక్కువ పని చేయాల్సి వస్తుందో మరియు దూర ప్రయాణాలు చేస్తారు మరింత ఇబ్బందిని ఎదుర్కొంటారు పైగా ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది అదే సమయంలో అంతరిక్షయానం చేయాలంటే ఎంతో కష్టం అనే చెప్పాలి సహజంగా మహిళలు ప్రాంతాలు మారినప్పుడు శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. దీంతో రుచి చక్రంలో కూడా మార్పు జరుగుతుంది. అదేవిధంగా అంతరిక్షయానం చేసినప్పుడు మహిళా వ్యోమగాములు కూడా నెలసరి సమయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతరిక్ష యాత్ర చేసిన మహిళలు 60 మందికి పైగా ఉన్నారు.
సునీత విలియమ్స్ లాంటి కొంతమంది మహిళా వ్యోమగాములు నెలలు తరబడి అంతరిక్షంలోనే గడుపుతున్నారు. అలాంటి సమయంలో నెలసరిని ఎదుర్కొంటే తప్పకుండా ఇబ్బంది పడతారు. ముఖ్యంగా హార్మోన్లకు సంబంధించిన మార్పులు ఎదురవుతాయి. దీంతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి ఉండదు అని అందరికీ తెలిసిందే అలాంటప్పుడు నెలసరి సమయంలో రక్త ప్రసరణ పై ప్రభావం పడుతుంది మరియు నెలసరి సమయంలో అనారోగ్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అని చాలామంది అనుకుంటారు. కాకపోతే అది నిజం కాదు ఎందుకంటే, భూమి పై నెలసరి సమయంలో రక్తం శరీరం నుండి ఎలా అయితే బయటకు వస్తుందో అదే విధంగా అంతరిక్షంలో కూడా జరుగుతుంది మరియు రుతుచక్రంలో కూడా ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా మహిళల కోసం అంతరిక్షంలో నెలసరికి సంబంధించిన ఉత్పత్తులని తీసుకొని వెళ్లే విధంగా నాసా ప్రోత్సహించడం జరుగుతుంది. కనుక నెలసరి సమయంలో మహిళలు వాటిని ఉపయోగించవచ్చు. సహజంగా శారీరకంగా నెలసరి సమయంలో శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకోసం అంతరిక్షంలోకి వెళ్లే మహిళా వ్యోమగాములు వారి అంతరిక్ష యాత్ర కోసం నెలసరిని వాయిదా కూడా వేసుకుంటారు. కొంత శాతం మహిళలు గర్భనిరోధక మాత్రలను వేసుకుంటారు. మరికొందరు అయితే ఈస్ట్రోజన్ కు సంబంధించిన మాత్రలను ఉపయోగిస్తారు. వీటితోపాటుగా దీర్ఘకాలంలో ఉపయోగించే కాంట్రాసెప్టివ్ పద్ధతులను కూడా పాటిస్తారు. దీంతో నెలసరి మరియు దానికి సంబంధించిన సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.