ఆన్లైన్ స్నేహాలు వలన ఇన్ని నష్టాలా? అనారోగ్య సమస్యలతో కూడా ఇబ్బంది పడే అవకాశం!

-

ఈ మధ్యకాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందడంతో అందరూ ఆన్లైన్ స్నేహాలకు బాగా అలవాటు పడిపోయారు. ఎన్నో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈజీగా కనెక్ట్ అయ్యేలా వ్యవస్థలు తయారయ్యాయి. కానీ ఆన్లైన్ స్నేహం వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. చాలామంది తమ గురించి అసత్య సమాచారం ఇస్తారు. నకిలీ ప్రొఫైల్స్‌తో మోసం చేస్తారు. ఇది సైబర్ నేరాలకు దారితీసే అవకాశముంది కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి.

ఆన్లైన్ స్నేహాలు ఎక్కువగా డిజిటల్ కనెక్షన్‌తో మానిపడతాయి కానీ, భావోద్వేగ సంబంధాలు ఉండవు. మీ వ్యక్తిగత జీవితం గురించి వారికి తెలియదు, కనుక వారు మీకు మానసికంగా సహాయపడలేరు. ఇలా ఉండటంతో ఎక్కువ సమయం వృథా అవుతుంది. చదువు, ఉద్యోగం వంటి ముఖ్యమైన విషయాలపై దృష్టి తగ్గుతుంది. నిజమైన స్నేహితులు దూరమవుతారు. కుటుంబ సభ్యులనూ పట్టించుకోకుండా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది.

ఫోన్‌లో చాటింగ్, కాల్స్ ఎక్కువైతే గోప్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇది ఒక వ్యసనంగా మారి అనేక అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. నిద్రలేమి, ఏకాగ్రత లోపించడం వంటివి. ట్రోలింగ్, వేధింపులు, సైబర్ బులీయింగ్ వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా, ఆన్లైన్ స్నేహాల్లో హద్దులు లేకపోవడం వల్ల భవిష్యత్తులో సమస్యలు ఎదురవుతాయి. దీన్ని గమనించకుండా కొనసాగితే వ్యక్తిగత జీవితం మీద నెగటివ్ ప్రభావం పడే ప్రమాదం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news