చాలా మంది బరువు తగ్గడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రధానంగా రాత్రి సమయంలో ఆహారం మానేస్తూ ఉంటారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదు అనేది నిపుణుల మాట. రాత్రి సమయంలో డిన్నర్ తినకపోతే మాత్రం బరువు పెరగడం… మళ్ళీ ఆ బరువు తగ్గడం చాలా కష్టమవుతుందని అంటున్నారు. అసలు తిండి మానేయడం అనేది ఎంత మాత్రం మంచి ఎంపిక కాదు అంటున్నారు.
అయితే ఒక రేసీపీ మాత్రం మీరు బరువు తగ్గడానికి ఎంతో సహకరిస్తుంది అంటున్నారు వైద్యులు బరువు తగ్గడమే కాదు గుండెకు కూడా బలం చేకూరుస్తుంది అంటున్నారు. దీనిని గ్రీన్ మసూర్ దాల్ సూప్ అంటారు. మీకు కావలసిందల్లా ఒక కప్పు మసూర్ పప్పు, ఒక కప్పు బచ్చలికూర మరియు కొంచెం ఉప్పు, వెన్న మరియు మిరియాలు. దీనితో మంచి సూప్ చేసుకోవచ్చు అంటున్నారు.
మసూర్ పప్పు ఎన్నో రకాల శక్తివంతమైన పోషకాలను కలిగి ఉంటుంది. యుఎస్‌డిఎ పోషణ డేటా ప్రకారం కేవలం ఒక కప్పు మసూర్ పప్పులో 230 కేలరీలు, 16 గ్రాముల ,డైటరీ ఫైబర్, 18 గ్రాముల ప్రోటీన్లు మరియు 6.6 గ్రాముల ఇనుము ఉన్నాయి. ఫైబర్ యొక్క అధిక భాగం కారణంగా, రక్తంలో షుగర్ లెవెల్స్ ని అదుపులో ఉంచుతుంది. అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ మొత్తాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది,
గుండె జబ్బుల ప్రమాదాన్ని మరింత తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి ఎంతో సహకరిస్తుంది. ఎందుకంటే దానిలో పిండి పదార్థాలు మరియు తక్కువ కొవ్వు తక్కువగా ఉంటుంది. ఒక కప్పు మసూర్ పప్పులో 40 గ్రాముల కార్బోహైడ్రేట్ ఉందని, కేవలం 0.8 గ్రాముల కొవ్వు మాత్రమే ఉందని యుఎస్‌డిఎ డేటా తెలిపింది. మన శరీరానికి అవసరమైన అన్ని విటమిన్లు, ప్రోటీన్లు మరియు ఇతర పోషకాలను అందించడానికి ఒక కప్పు మసూర్ పప్పు సరిపోతుంది.
ఇక బచ్చలికూరలో విటమిన్లు, మెగ్నీషియం, కాల్షియం మరియు ఇనుము ఉన్నాయి, అయితే ఇందులో కేలరీలు, పిండి పదార్థాలు మరియు కొవ్వు తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గడానికి లేదా వారి క్యాలరీలను నిర్వహించడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళకు బచ్చలికూర మంచి ఎంపిక.
గ్రీన్ మసూల్ దాల్ సూప్ రెసిపీ;
వంట సమయం: 5 నిమిషాలు
కావలసినవి:
మసూర్ దాల్- 1 కప్పు
బచ్చలికూర- 1 కప్పు
వెన్న- 1 టీస్పూన్
ఉప్పు- 1 టీస్పూన్
నల్ల ఉప్పు- రుచి ప్రకారం
నిమ్మ రసం- రుచి ప్రకారం
నల్ల మిరియాలు- రుచి ప్రకారం
తయారీ:
పప్పు, బచ్చలికూర బాగా కడగాలి. దయచేసి గమనించండి: బచ్చలికూరను కడగడానికి ముందు ఎప్పుడూ కోయకండి, ఎందుకంటే ఇది నీటిలో కరిగే విటమిన్లు కోల్పోయే అవకాశం ఉంది.
ప్రెషర్ కుక్కర్‌లో పప్పు, బచ్చలికూర ఉంచండి.
ఉప్పు మరియు ఒక కప్పు నీరు వేసి మూత మూసివేయండి. రెండు విజిల్స్ రానివ్వండి.
ఒక గిన్నెలో పోసి దానికి వెన్న, మిరియాలు, నల్ల ఉప్పు, నిమ్మరసం కలపండి.
వేడి వేడి సూప్ రెడీ