కిడ్నీలో రాళ్లు ఉంటే ఎముకలు బలహీనం అయిపోతాయి…!

-

చాలా మందికి కిడ్నీలో రాళ్లు ఉంటాయి. అటువంటి వాళ్ళకి ఆస్టియోపొరొసిస్ లేదా బోన్ ఫ్యాక్చర్ రిస్క్ ఉండొచ్చు అని తాజా స్టడీస్ ప్రకారం వెలువడింది. జర్నల్ అఫ్ బోన్ అండ్ మినరల్ రెసెర్చ్
లో ప్రచురించబడిన దాని ప్రకారం మూత్రపిండాల్లో రాళ్లు ఉన్న వారిలో సుమారు వన్ క్వార్ట్రర్ మందికి ఆస్టియోపొరోసిస్ డయాగోనిసెస్ లేదా బోన్ ఫ్రాక్చర్ అవ్వచ్చు అని అంటున్నారు.

నిపుణులు ఈ విషయాలను చెప్పి ఇది మీకు ఉపయోగపడుతుంది అని మేము అనుకుంటున్నాము అని చెప్పారు. మూత్రపిండాల్లో రాళ్లు ఉండి బాధపడుతున్న వాళ్లకి ఎముకల బలం తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. అమెరికా లోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం ప్రధాన రచయిత కాళీ కల్యాణి గణేషన్ టీం 531,431 పేషెంట్స్ లో 2007వ సంవత్సరం నుంచి 2015 సంవత్సరం వరకు కిడ్నీ స్టోన్ తో ఇబ్బంది పడ్డారని అన్నారు.

23.6 శాతం పేషెంట్లు ఆస్టియోపోరొసిస్ డయాగ్నోసిస్ లేదా బోన్ ఫ్యాక్చర్ డయాగ్నోసిస్ కిడ్నీ స్టోన్ డయాగ్నసిస్ చేయించుకుంటున్నప్పుడు చేయించుకోవాల్సి వచ్చిందని అన్నారు. కిడ్నీ స్టోన్ డయాగ్నసిస్ చేయించుకున్న తర్వాత 20 శాతం మంది ఆస్టియోపొరొసిస్ డయాగ్నోసిస్ చేయించు కోవాల్సి వచ్చింది.

మధ్య వయస్కులు తో పాటు వృద్ధులు కి కూడా ఈ రిస్క్ ఉంటుందని రీసెర్చర్లు చెప్పారు. కిడ్నీ లో స్టోన్స్ ఏర్పడిన తర్వాత ఆస్టియోపొరోసిస్ లేదా బోన్ ఫ్యాక్చర్ డయాగ్నసిస్ ఉండొచ్చు అంటున్నారు. అలానే గణేషన్ తమ భవిష్యత్తు పని లో ఎటువంటి వాళ్ళ కి హై రిస్క్ ఉంటుంది అనే విషయాన్ని కూడా కనుక్కుంటాము అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news