2020-21సంవత్సరానికి వడ్డీ రేట్లని ప్రకటించనున్న ఈపీఎఫ్ఓ.

-

ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈ సంవత్సరానికి ఈ రోజున వడ్డీ రేట్లని ప్రకటించనుంది. సెంట్రల్ బోర్డ్ ట్రస్టీ ప్రకారం ఈ సంవత్సరం వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. కరోనా మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం ఈపీఎఫ్ఓ రేట్లు బాగా తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. ఈపీఎఫ్ఓ ట్రస్టీ కేఈ రఘునాథన్ ఫిబ్రవరి 16న మాట్లాడిన మాటల ఆధారంగా శ్రీనగర్ లో కలవడం నిజమే అని, కానీ వడ్డీ రేట్ల గురించిన విషయాలేవీ అజెండాలో లేవని పేర్కొన్నారు.

2019-20లో వడ్డీ రేటు 8.5గా ఉంది. అదే 2018-19లో 8.65శాతంగా ఉండింది. ఒక్కసారిగా వడ్దీరేట్లని తగ్గించి 8.5కి తగ్గించారు. 2012-13 తర్వాత ఇదే అత్యంత తక్కువ వడ్డీ రేటు. 2016-17 సంవత్సరంలో ఈపిఎఫ్‌ఓ తన సభ్యులకు 8.65 శాతం వడ్డీ రేటును అందించగా, 2017-18లో 8.55 శాతం వడ్డీ రేటును ఇచ్చింది. కాగా, వడ్డీ రేటు 2015-16లో స్వల్పంగా 8.8 శాతంగా ఉంది.

శనివారం విడుదల చేసిన పేరోల్ డేటా ప్రకారం, 2020 డిసెంబర్ నెలలో ఈపీఎఫ్ఓతో కొత్త నమోదు 24 శాతం పెరిగింది. కార్మిక మంత్రిత్వశాఖ ప్రకారం కొత్తగా 53.73లక్షల సభ్యులు చేరారని తెలుస్తుంది. కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ ఈ లెక్క పెరిగిందని అంటున్నారు. ఏదేమైనా ఈ ఆర్థిక సంవత్సరానికి (2020-21) ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీని EPFO ​​తగ్గిస్తుందని ఊహాగానాలు వస్తున్నాయి. కరోనా మహమ్మారి సహా అనేక కారణాల వల్ల 2019-20 సంవత్సరానికి ఇచ్చిన వడ్డీరేటు 8.5శాతం కంటే మరింత తగ్గుతుందని అంటున్నారు. అదే జరిగితే కార్మికులు తీవ్రంగా నష్టపోతారని, వారికి వచ్చేదీ ఏమీ ఉండదని నిపుణులు చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news