మన శరీరంలో కాళ్లే మన బరువును మోసేది. అందుకే మనం బాడీ పెయిన్స్ అయినా తట్టుకోగలం కానీ మోకాళ్లు, పాదాల్లో ఏదైనా నొప్పి ఉంటే అడుగుతీసి అడుగు వేయాలంటే నరకంగా అనిపిస్తుంది. కానీ గుండె, కిడ్నీలు, లివర్ వీటి గురించి పట్టించుకున్నట్లు పాదాల గురించి పెద్దగా శ్రద్ధ పెట్టరు. ఆరోగ్యం విషయంలోనే కాదు అందం విషయంలో కూడా చాలా మంది వీటిని లైట్ తీసుకుంటారు. పాదాలకు రక్త ప్రసరణ చాలా అవసరం. ఎక్కువ సేపు ఒకే చోట కూర్చొని పనిచేసేవారు, శారీరక కదలికలు అంతగా లేనివారు తదితరుల పాదాలకు రక్తప్రసరణ సక్రమంగా జరగదు.
పాదాల్లో బ్లడ్ సర్కూలేషన్ సరిగ్గా లేకపోతే కాళ్లలో తిమ్మిరి, నొప్పి వంటి సమస్యలు వస్తాయి. బిజీ వర్క్‌లో కూడా మన పాదాలకు వ్యాయామం చేయవచ్చు. సాధారణంగా, పాదాలను ఎడమ నుండి కుడికి మరియు కుడి నుండి ఎడమకు తిప్పడం వల్ల పాదాలకు తగినంత రక్త ప్రసరణ జరుగుతుంది. పాదాలకు మృదువైన కండరాలు ఉంటాయి. ఇది హృదయానికి అనుగుణంగా ఉంటుందట.. పాదాలకు వ్యాయామం చేస్తే శరీరమంతా రక్తప్రసరణ పెరుగుతుంది.
గుండెకు డీఆక్సిజనేటెడ్ రక్తాన్ని సరఫరా చేయడంలో, శరీరంలోని మిగిలిన భాగాలకు ఆక్సిజన్ ఉన్న రక్తాన్ని సరఫరా చేయడంలో పాదాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఆక్సిజన్ క్షీణించిన రక్తాన్ని గుండెకు పంపడానికి పాదాలు బాధ్యత వహిస్తాయి.
2016లో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిస్సౌరీ-కొలంబియాలో నిర్వహించిన అధ్యయనంలో కూర్చొని పాదాలను తిప్పడం ద్వారా కాలులోని రక్తనాళాల్లోని అడ్డంకులు తొలగిపోతాయని తేలింది. ఎక్కువసేపు నిష్క్రియంగా ఉండటం, ఎక్కువసేపు కంప్యూటర్‌లో పనిచేయడం వల్ల రక్త ప్రసరణ జరగదు. దీని వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. దానిని నివారించడానికి ఫుట్ వ్యాయామాలు తప్పక చేయాలి.
మధుమేహం, రక్తపోటు, ధూమపానం వంటి సమస్యలతో బాధపడేవారిలో కాళ్లలో రక్తప్రసరణ తగ్గుతుంది. కాబట్టి అలాంటి వారికి ఫుట్ రొటేషన్ శిక్షణ చాలా అవసరం. కనీసం 8 గంటలు కూర్చోవాల్సిన అవసరం ఉంటే, మీరు ప్రతి 30 నిమిషాలు లేదా 40 నిమిషాలకు కొన్ని నిమిషాలు మీ పాదాలను తిప్పవచ్చు. ఈ వ్యాయామం చేయడం వల్ల కాళ్లలో రక్తం గడ్డకట్టడాన్ని నివారించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే గంటకోసారి లేచి అటు ఇటు తిరగాలని అంటారు.