వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించటంపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ క్లారిటీ ఇచ్చారు. రైతులకు వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించటం లేదన్నారు. అసెంబ్లీలో కూడా రైతులకు స్మార్ట్ బిగించటం లేదని చాలా సార్లు చెప్పామని… ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల నుంచి తగ్గిస్తున్నామని ప్రచారం పెట్టారు.. ఇందులో నిజం లేదని వివరించారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్.
కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. ఇది మంచి పద్ధతి కాదని తెలిపారు. రాజకీయ అవసరాల కోసం ఇలాంటి ప్రచారాలు రాష్ట్ర అభివృద్ధికి మంచిది కాదని వివరించారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఏపీకి పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. పవర్ రిఫార్మ్స్ లో కొత్త పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. చంద్రబాబు నాయకత్వంలో పరిశ్రమలు పెట్టేందుకు దావోస్ పర్యటనలో పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపిస్తున్నారని వివరించారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్.