పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం, ఆపై అబార్షన్.. ఎక్కడంటే?

-

ఏపీలోని అన్నమయ్య జిల్లా రాయచోటిలో దారుణం చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న బాలికపై లైంగిక దాడి చేసిన ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ కుమార్.. అంతటితో ఆగకుండా ఏడు నెలల గర్భం దాల్చిన బాలికకు మూడో కంటికి తెలియకుండా అబార్షన్ చేయించాడు.

ఓ ప్రవేటు ఆస్పత్రిలో ఓ నర్సు సాయంతో అబార్షన్ చేయించినట్లు సమాచారం. ఆ విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు విజయ్ కుమార్‌ని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version