కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పిన వారికే పథకాలు ఇస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నాయకుడు సంపత్ కుమార్. సంక్షేమ పథకాల అమలు కోసం గ్రామ సభలు నిర్వహిస్తోంది కాంగ్రెస్ సర్కార్. ఈ తరుణంలోనే… కాంగ్రెస్ నాయకుడు సంపత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏ ప్రభుత్వ పథకం అయినా కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పిన వారికే ఇస్తామని ప్రకటించారు.
ఇందిరమ్మ కమిటీలో ఉన్న 5 మంది సభ్యులు చెప్తే రేవంత్ రెడ్డి చెప్పినట్లే అంటూ వ్యాఖ్యనించారు కాంగ్రెస్ నాయకుడు సంపత్ కుమార్. ఇక అంతకు ముందు…కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పిన వారికే ప్రభుత్వ పథకాలు అందుతాయని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దలు, కార్యకర్తలు చెప్పిన వారికే ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు ఇస్తామని స్పష్టంచేశారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ.. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు లిస్ట్ రెడీ చేసి స్థానిక ఎమ్మెల్యేకి ఇస్తే, ఎమ్మెల్యే ఎంపిక చేసిన లిస్టు మాత్రమే ఫైనల్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఏ ప్రభుత్వ పథకం అయినా కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పిన వారికే ఇస్తాం
ఇందిరమ్మ కమిటీలో ఉన్న 5 మంది సభ్యులు చెప్తే రేవంత్ రెడ్డి చెప్పినట్లే – కాంగ్రెస్ నాయకుడు సంపత్ కుమార్ pic.twitter.com/BbdCnj2C7B
— Telugu Scribe (@TeluguScribe) January 21, 2025